Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి
కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ (Intirior Designer) వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చింది.
Hyderabad, OCT 28: కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి (Rithu Chowdary) బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ (Intirior Designer) వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చింది. తన ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను ఒకరికి అప్పగిస్తే డబ్బు తీసుకుని మోసం చేశాడని.. అందువల్ల సుమారు రూ. 2 లక్షలు మోసపోయినట్లు ఆమె తెలిపింది. 'మా ఫ్యామిలీకి నాన్న దూరం కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన లేకపోవడంలో నా కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను ఒకరికి అప్పజెప్పాను. అందుకు గాను అతనికి రూ. 5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. కానీ అతను డబ్బు తీసుకున్నాక పని మాత్రం నేను చెబుతున్నట్లుగా చేయలేకపోయాడు.. పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడు.
దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి.. డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా.. ఫోన్లకు కూడా స్పందించేవాడు కాదు. తిరిగి మమ్మల్నే అనరాని మాటలు అనేవాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 3లక్షలు తిరిగి ఇచ్చాడు. ఓవైపు బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమయ్యా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోవడంతో నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఇల్లు నిర్మాణ విషయంలో నేను తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురికావడమే కాకుండా.. ఆర్థికంగా మోసపోయాను. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా. అతన్ని పనిలో నుంచి తొలగించాక ఇంటీరియర్ వర్క్‌ను వేరే వాళ్లకు అప్పగించాను. ప్రస్తుతం వర్క్ పూర్తి కావచ్చింది. నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను.' అంటూ రితూ చౌదరి ((Rithu Chowdary)) తెలిపింది.