Jabardasth Kirak RP, Getup Srinu: తిన్న కంచంలోనే ఉచ్చ పోయకు, కిర్రాక్ ఆర్పీపై గెటప్ శ్రీను ఫైర్, మల్లెమాల, జబర్దస్త్ జోలికి వస్తే బాగోదు అంటూ వార్నింగ్..
కిర్రాక్ ఆర్పీ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ మల్లెమాల, అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి పై బురద చల్లే పని చేస్తుంటే, గెటప్ శ్రీను లాంటి వారు కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
జబర్దస్ మల్లెమాల ప్రొడక్షన్స్ పై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న విమర్శలు టాలివుడ్ చిత్ర పరిశ్రమలో కాక రేపుతున్నాయి. యూట్యూబ్ చానెల్స్ వేదికగా ఆర్పీ చేస్తున్న షాకింగ్ కామెంట్స్ ఇప్పటికే బుల్లితెర పరిశ్రమలో సునామీ సృష్టిస్తున్నాయి. అయితే ఆర్పీ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ మల్లెమాల, అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి పై బురద చల్లే పని చేస్తుంటే, గెటప్ శ్రీను లాంటి వారు కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
జబర్దస్త్, మల్లెమాల సంస్థపై అంతే కాదు మల్లెమాల అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పై కూడా కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఆర్టిస్టులైన చమ్మక్ చంద్ర, మహేష్, రచ్చ రవి, వేణు, ధనరాజ్ లాంటి వారు ఎప్పుడు మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద, అలాగే నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదు. కానీ కిర్రాక్ ఆర్పీ మాత్రం మల్లెమాల లాంటి దరిద్రమైన నీఛమైన ప్రొడక్షన్ కంపెనీ ప్రపంచంలో ఎక్కడా ఉండదని.. తనకి ఈటీవీ అన్నా.. జబర్దస్త్ అన్నా అస్సలు ఇష్టం ఉండదని తీవ్ర విమర్శలు చేశాడు.
అయితే మల్లెమాల సంస్థ మీద కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా జబర్దస్ద్ కంటెస్టెంట్ గెటప్ శ్రీను వెనకేసుకొచ్చారు. ఆర్పీ ఎందుకిలా అబద్ధాలు ఆడుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. తాము ఎప్పటికీ జబర్దస్త్ బిడ్డలం అని ఆర్పీని ఈ రోజు అంతో ఇంతో గుర్తుపెడుతున్నారని, ఆర్పీ అనుభవించేది మొత్తం మల్లెమాల ప్రొడక్షన్ పెట్టిన భిక్ష అని చెప్పుకొచ్చారు.
ఆర్పీ అసలు ఎవరని, శ్యాంప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడే రేంజ్ ఉందా అని అన్నారు. గేటు బయట నిలబడి అవకాశాల కోసం అడుక్కున్న ఆర్పీని గేటు లోపలికి ఎవరు పంపించారు. ఎవరు అవకాశాలు ఇచ్చారు. అనే విషయాలు గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పుకొచ్చారు. మల్లెమాల ప్రొడక్షన్ ఫుడ్ బాగోలేదని కిర్రాక్ ఆర్పీ చేసిన ఆరోపణల పై స్పందిస్తూ ఇంట్లో రోజు తినే ఐటమ్స్ ఒక్కో రోజు బాగోక పోవచ్చు అంత మాత్రాన అది చెత్త అనుకుంటే ఎలా, అని అన్నారు.