Naga Babu Quits Jabardasth Show: జబర్దస్త్‌‌కు నాగబాబు గుడ్‌బై, ఈ రోజు ఎపిసోడ్‌‌తో లాస్ట్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించిన నాగబాబు, జీతెలుగు‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు

వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్ (Jabardasth)’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth). ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. కాగా ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Jabardasth Show: nagababu-responds-on-his-youtube-channel-on-why-he-quit-jabardast (Photo-Youtube)

Hyderabad, November 22: తెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్`. వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్ (Jabardasth)’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth). ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. కాగా ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

నాగబాబు( Naga Babu)తో పాటు టీం లీడర్లు ఈ షో నుంచి తప్పుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. వీటికి నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ షో ఆరంభం నుంచి ఇప్పటివరకు రోజాతోపాటు నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్టు నాగబాబు (Naga Babu Quits Jabardasth Show) స్వయంగా వెల్లడించారు. నేటి (శుక్రవారం) ఎపిసోడ్‌తో `జబర్దస్త్` నుంచి తప్పుకుంటున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ (YouTube channel) ద్వారా ఆయన వెల్లడించారు.2013 ఫిబ్రవరి నుంచి 2019 ఈరోజు వరకు జబర్దస్త్‌తో తనకు ఎమోషనల్, హ్యాపీ జర్నీ కొనసాగిందని నాగబాబు అన్నారు.

తాను జబర్దస్త్ మానేయడానికి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అందుకనే స్వయంగా దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చానన్నారు. జబర్దస్త్ గురించి తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడింది లేదని.. ఎల్లప్పుడూ ఈ షోకు పూర్తి సపోర్ట్‌నే అందించానని నాగబాబు చెప్పుకొచ్చారు.

నాకు నేనుగా ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. సృజనాత్మక విభేదాల వల్లే బయటకు రావాల్సి వచ్చింది. దీంట్లో ఎవరి తప్పూ లేదు. నాకు అవకాశం ఇచ్చిన `జబర్దస్త్` నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి(Shyam Prasad Reddy)కి ధన్యవాదాలు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ షోకు వచ్చాను.

కామెడీపై నాకు ఉన్న ఆసక్తి చూసి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి అవకాశం ఇచ్చారు. నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. `జబర్దస్త్`లో నా ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా పూర్తయింది అనేది త్వరలో వెల్లడిస్తాన`ని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif