Motewari Word Dispute: చెట్టు కింద కూసున్నవమ్మ పాటలో మోతెవరి పదం వివాదం, క్లారిటీ ఇచ్చిన మంగ్లీ, నేను తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను, నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ సింగర్

అయితే ఈ పాటలో అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో (Motewari Word Dispute) కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ (Singer Mangli Clarify) ఇచ్చింది.

Singer Mangli (Photo-Facebook)

తెలంగాణ గాయని మంగ్లీ బోనాలు సందర్భంగా చెట్టు కింద కూసున్నవమ్మ (Chettukinda Kusunnavamma) అనే పాటను విడుదల చేసిన సంగతి విదితమే. అయితే ఈ పాటలో అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో (Motewari Word Dispute) కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ (Singer Mangli Clarify) ఇచ్చింది. ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు పాలమూరి రామస్వామిగారు 25 ఏళ్ల క్రితమే ఈ పాట రాశారని తెలిపింది. గ్రామదేవతలను ఎలా పూజిస్తారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం.. 'చెట్టుకింద కూసున్నవమ్మ' పాటలో మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది కొందరి విమర్శకుల వాదన, నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు, పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాం. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల్ల కొలువులు ఇలా రకరకాల ఆచారాలున్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించామని మంగ్లీ తెలిపారు.

Here's Singer Mangli ClarifyTweet

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్‌, శీతలా(సాతి భవాని) పండగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకునేది గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్‌గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వల్లే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో మా తాతలనాటి ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడి కట్టించి పూజలు చేస్తున్నాము.

ఏనాడూ గుడికి వెళ్లనివాళ్లు, బోనం ఎత్తని వాళ్లు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో గమనించాలి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా లాల్‌ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు.. ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈసారికి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్లి మరీ చిత్రీకరించాము.

శ్రీకృష్ణదేవరాయలు పాత్ర బాలయ్య చేస్తేనే సినిమా తీస్తా, ఆదిత్య 369 సినిమా 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్న చిత్ర యూనిట్

ప్రతి పండగలో నా పాటల ద్వారా మీ ఇంటి భాగస్వామినయ్యాను. మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులో పెట్టుకున్నారు. ఇందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఒక్కరోజులో ఫేమస్‌ కాలేదు. నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



సంబంధిత వార్తలు

Kissik Lyrical Video Song Is Out Now: వామ్మో ఇంత కిర్రాక్ మాస్ బీట్ సాంగా? శ్రీ‌లీల స్టెప్స్ కు య్యూట్యూబ్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేసింది, చూసేయండి!

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

Kissik Song Release Date: పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేస్తోంది! స‌మంత పాట కంటే రెట్టింపు వోల్టేజ్ తో రాబోతున్న శ్రీ‌లీల ఐటెం సాంగ్, ఇంతకీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

‘Pushpa 2 – The Rule’:పుష్ప‌రాజ్ తో డ్యాన్సింగ్ క్వీన్ వ‌చ్చేసింది! శ్రీ‌లీల స్పెష‌ల్ సాంగ్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీమ్