Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.

Boss Season 8 winner Nikhil (Credits: X)

Hyderabad, Dec 16: ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో (Star MAA TV) ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ (Bigg Boss Season 8) విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ గా అవతరించాడు. నిఖిల్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రూ.55 లక్షల చెక్, మారుతీ సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారు ప్రదానం చేశారు. బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అందుకున్న నిఖిల్ ప్రేక్షకులకు, ఇతర పోటీదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నట్టు వేదిక పైనుంచి ప్రకటించాడు.

జాకీర్ హుస్సేన్ ఇక‌లేరు, గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన మ్యూజిక్ లెజెండ్

కిందటేడాది ఇలా..

దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించారు. గత సీజన్‌ లో జరిగిన అవాంచిత ఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యగా జూబ్లీ హిల్స్‌ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సూచనతో ప్రైజ్ మనీ తీసుకున్న నిఖిల్ సరాసరి తన నివాసానికి చేరుకున్నారు. కాగా, గతేడాది డిసెంబర్ 17న ముగిసిన బిగ్‌ బాస్-7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్