Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కి రష్మీ గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్, లిమిట్స్ లో ఉండు లేకపోతే నా రెండో సైడ్ చూస్తావు అంటూ రెచ్చిపోయిన బ్యూటీ...

వీరి జంట‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో ర‌ష్మీ గౌత‌మ్.. త‌న తోటి యాంక‌ర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌కు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట.

Sudigali Sudheer, Rashmi

సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ వీరిద్ద‌రి జోడీ జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. వీరి జంట‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో ర‌ష్మీ గౌత‌మ్.. త‌న తోటి యాంక‌ర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌కు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. ‘నేను లేనప్పుడు చేసింది చాలు.. నీ హద్దులో మర్యాదగా ఉండు..’ అంటూ ర‌ష్మీ అంటున్న‌ప్పుడు స్టేజ్‌పై హైప‌ర్ ఆది కూడా ఉన్నారు. సుధీర్‌, ర‌ష్మి మ‌ధ్య అంత పెద్ద గొడ‌వ ఎందుక‌య్యింది? అనే వివ‌రాలు తెలుసుకోవాలంటే..

ఈ మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్ ప్రోగ్రామ్ నుంచి సుధీర్ ర‌ష్మీ గౌత‌మ్ త‌ప్పుకున్నారంటూ వార్త‌లు వినిపించాయి. అందుకు త‌గ్గ‌ట్లే వారు కొన్ని రోజులు జ‌బ‌ర్ద‌స్త్‌తో పాటు స‌ద‌రు టీవీ ఛానెల్ వారు నిర్వ‌హించే మ‌రికొన్ని ప్రోగ్రామ్స్‌లోనూ క‌నిపించ‌లేదు. దీనిపై బుల్లి తెర‌పై ఫ్యాన్స్ అల‌క బూనారు. ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ రూపంలో త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు కూడా. అస‌లు సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్‌.. త‌మ క్రేజ్‌ను బేస్ చేసుకుని త‌మ రెమ్యున‌రేష‌న్స్ పెంచాల‌ని గ‌ట్టిగా కోర‌డంతో, జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు వారిని ప‌క్క‌న పెట్టారంటూ కూడా వార్త‌లు గట్టిగానే వినిపించాయి. అయితే ఏం జ‌రిగిందో ఏమో కానీ.. మ‌ళ్లీ సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ జంట జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌లో సంద‌డి చేయ‌డానికి వ‌చ్చేశారు. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద్‌ద‌స్త్‌లో వీరి హంగామాను చూపిస్తూ స్టేజ్‌పై ‘ఉప్పెన‌’లో ‘జ‌ల జ‌ల జ‌లపాతం నువ్వు..’ అనే పాటతో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాలో ‘నీ కాళ్ల‌ను ప‌ట్టుకు వ‌ద‌ల‌నందే..’ పాటకు ఇద్ద‌రూ స్టెప్పులేశారు. ఆ సమయంలో వారిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దాగా సంభాష‌ణ సాగింది. దాంట్లో సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ గౌత‌మ్ వార్నింగ్ ఇచ్చేసింది.

అయితే సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్ద‌రినీ ఇలా జంట‌గా మ‌ళ్లీ స్టేజ్‌పై చూడ‌టంపై సంతోషాన్ని కామెంట్స్ రూపంలో వ్య‌క్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. కొంద‌రైతే వీరి జోడీని మ‌ళ్లీ ఢీ 14కి తీసుకు రావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మ‌రి నిర్వాహ‌కులు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ను ప‌ట్టించుకుంటారేమో చూడాలి.



సంబంధిత వార్తలు