Swathi Naidu: అవకాశం ఇస్తానంటూ చమ్మక్ చంద్ర నన్ను వాడుకుని వదిలేశాడు, సంచలన ఆరోపణలు చేసిన స్వాతి నాయుడు, ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని చంద్ర
తనకు జబర్దస్త్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర (jabardasth Chammak Chandra) తనను గదికి తీసుకుని వెళ్లి వాడుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర స్కిట్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. దీంతో పాటుగా ఆమధ్య ఎఫ్2 చిత్రంలో కొరడాతో కొట్టుకుంటూ అందర్నీ నవ్వించాడు. జబర్దస్త్ ఒక ఎత్తయితే సినిమాల్లో చమ్మక్ చంద్ర మేనరిజమ్ మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.. చమ్మక్ చంద్రపై యూ ట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు (Swathi Naidu) తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు జబర్దస్త్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర (jabardasth Chammak Chandra) తనను గదికి తీసుకుని వెళ్లి వాడుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
వాడుకున్నాక తనకు అవకాశం ఏదీ అంటే... ఫోన్ కట్ చేసాడని ఆరోపించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో ఆడవాళ్లకి అవకాశాలు కష్టమని చెప్పాడనీ, అలాగైతే తన సోదరుడికి ఛాన్స్ ఇప్పించమంటే తప్పించుకు తిరిగాడని చెప్పుకొచ్చింది. చివరికి తను పోలీసు స్టేషనులో కేసు పెడితే.. అక్కడ కూడా తనను నోటికొచ్చినట్లు మాట్లాడాడని అంది. ఇలాంటి వెధవలు తన జీవితంలో చాలామంది వున్నారనీ, వాడుకుని వదిలేయడం వారికి అలవాటు అంటూ చెప్పింది.
నాలా చమ్మక్ చంద్ర చేతిలో మోసపోయినవాళ్లు చాలామంది వున్నారనీ, కానీ వారందరూ భయపడి ముందుకు రావడం లేదని వెల్లడించింది. తనకు మటుకు ఎలాంటి భయం లేదనీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ల చేతుల్లో మోసపోకుండా వుంటారని తనకు జరిగిన అన్యాయాన్ని చెపుతున్నానంటూ వెల్లడించింది స్వాతి నాయుడు. ఈ ఆరోపణలపై చమ్మక్ చంద్రం స్పందించాల్సి ఉంది.