Jabardasth Fame Faima: అమ్మ బీడీలు చుట్టి మమ్మల్ని సాకింది, జబర్దస్ట్ ఫేమ్ పైమా కన్నీటిగాథ, మా అమ్మకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే చాలంటన్న కమెడియన్ నటి

తన కామెడీ టైమింగ్​తో ప్రతీ స్కిట్​నూ పండిస్తూ..నవ్వులు పూయిస్తోంది. అయితే బుల్లితెరకు రాకముందు పైమా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.

Jabardasth Fame Faima (Photo-Video Grab)

జబర్దస్త్​'లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువకాలంలోనే బుల్లితెరపై ఫైమా (Jabardasth Fame Faima) పాపులర్ అయిపోయింది. తన కామెడీ టైమింగ్​తో ప్రతీ స్కిట్​నూ పండిస్తూ..నవ్వులు పూయిస్తోంది. అయితే బుల్లితెరకు రాకముందు పైమా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. పటాస్​ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఫైమా (Faima) ఈమె ఎక్స్​ట్రా జబర్దస్త్​తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. బుల్లెట్​ భాస్కర్​, ఇమ్మాన్యుయెల్​ చేసే స్కిట్​లలో పాల్గొని తనదైన శైలి కామెడీ టైమింగ్​తో వీక్షకులను కితకితలు పెట్టిస్తోంది.

చాలా తక్కువ కాలంలో జబర్దస్త్​లోని పాపులర్​ ఆర్టిస్ట్​లలో ఒకరిగా నిలిచింది. అయితే ఈ ప్రయాణం వెనుక ఆమె అసలు లక్ష్యం వేరే ఉందట. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జబర్దస్త్​లో తన ప్రయాణం మొదలైన విషయాలపై ఓ ప్రముఖ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన తల్లి.. బీడీలు చుట్టి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతోనే తమకు ఏం కావాలన్నా కొనేదని చెప్పుకొచ్చింది. తాము మంచి పేరు సంపాదించాలని ఆమె ఆకాంక్షించేదని చెప్పింది. చిన్న వయసులోనే అక్కాచెళ్లెళ్లకు పెళ్లి అయిపోయిందని పేర్కొంది. మేం నలుగురు అక్కాచెళ్లెలం. మాలో ముగ్గురికి పెళ్లిళ్లు కూడా చేసేసింది. మంచిపేరు తెచ్చుకోండి అని చెప్తూ ఉండేది. మంచి పేరు అంటే ఎలా తీసుకొస్తారో నాకు తెలిసేది కాదు. కానీ మల్లెమాల ద్వారా నేను మంచి పేరు తీసుకొచ్చాను.. అలా అమ్మ కల నెరవేరిందని తెలిపింది.

తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైపు, ముక్కు అవినాష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేకింగ్ శేషు, ఏ స్థాయిలో ఉన్నా ఎవరివల్ల ఎదిగాం అనే విషయాన్ని మరచిపోకూడదని హితవు

ఇక్కడకు రాక ముందు నాకేం డ్రీమ్స్​ లేవు. చదువులో కూడా వెనకపడేదాన్ని. మిషన్​లో బట్టలు కుట్టడం నేర్చుకుని జీవనం సాగించాలని అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక ఉండేది.. అమ్మకు ఇల్లు కట్టాలని. మా నలుగురినీ సాకుతూ ఇళ్లు మారుతూ ఉండేది. ఒక ఇంటివాళ్లు వెళ్లిపోమంటే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే. వేరే ఇల్లు దొరికినా సరైన సదుపాయాలు లేక.. సర్దుకుపోయేవాళ్లం. ఆ కష్టాలను చూశాను కాబట్టీ మాకంటూ ఓ ఇల్లు ఉంటే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు నా గోల్​ కూడా అదే. అందుకే ఎలాగైనా మంచి ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను." అని చెప్పుకొచ్చింది ఫైమా.