Encounter in JK: జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. అధికారి సహా అమరులైన నలుగురు సైనికులు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు.
Srinagar, July 16: జమ్మూకశ్మీర్ (Jammu-Kashmir) లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists), భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు (Jawans) అమరులయ్యారు. ఈ జాబితాలో ఒక అధికారి కూడా ఉన్నారు. సోమవారం సాయంత్రం దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు సంయుక్తంగా కార్డన్ , సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇదే సమయంలో సైనికులకు ఉగ్రవాదులు తారసపడ్డారు. వెంటనే సైనికులపై ఉగ్రమూకలు కాల్పులకు పాల్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. మొదలైంది. ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.
తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..
Four Indian Army soldiers including an officer have been killed in action during an encounter with terrorists in the Doda area of Jammu and Kashmir. The operations are still going on. More details awaited: Defence officials https://t.co/N7qxseN5jh pic.twitter.com/5fePA8Mihd
మరోసారి కాల్పులు
కొద్ది సేపు ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయితే సవాళ్లతో కూడిన భూభాగం, దట్టమైన చెట్లు ఉన్నప్పటికీ ఒక అధికారి నేతృత్వంలోని సైనికులు వారిని వెంబడించారని అధికారి ఒకరు చెప్పారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో అడవిలో మరోసారి కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్‌లో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించినట్టు తెలిపారు. అయితే, పరిస్థితి విషమించడంతో అధికారితో సహా నలుగురు సైనికులు మంగళవారం ఉదయం అమరులైనట్టు వెల్లడించారు. మరో సైనికుడికి చికిత్స కొనసాగుతున్నట్టు వివరించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)