Package Breakup-5: జాతీయ ఉపాధి హామీకి అదనపు నిధులు, రాష్ట్రాలకు రుణ పరిమితి 5 శాతానికి పెంపు, విద్య మరియు ఆరోగ్యంకు భారీ కేటాయింపులు సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ- 5 విడత ప్రకటనల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
ఈరోజు తన ప్రసంగంలో MGNREGA, ఆరోగ్యం మరియు విద్య, కంపెనీ యాక్ట్ యొక్క డిక్రిమినలైజేషన్ తో పాటు వ్యాపార మరియు వాణిజ్య సంబంధింత కార్యకలాపాల సరళీకరణ....
New Delhi, May 17: ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ యొక్క ఐదవ మరియు ఆఖరి భాగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదివారం ప్రకటించారు. ఈరోజు తన ప్రసంగంలో MGNREGA, ఆరోగ్యం మరియు విద్య, కంపెనీ యాక్ట్ యొక్క డిక్రిమినలైజేషన్ తో పాటు వ్యాపార మరియు వాణిజ్య సంబంధింత కార్యకలాపాల సరళీకరణ, రాష్ట్రాలకు వనరుల పెంపు తదితర అంశాలపై ఆర్థిక మంత్రి దృష్టి సారించారు.
ఉపాధి కల్పన కోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (MGNREGA) కింద అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయించనున్నట్లు సీతారామన్ తెలిపారు. ఈ నిధులతో వలస కూలీలందరికీ కావాల్సినంత ఉపాధి దొరుకుతుందని అన్నారు.
నిర్మలా సీతారామన్ ప్రకటనలలోని ముఖ్యాంశాలు
రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు: రాష్ట్రాలకు రుణ పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 3.5 శాతం వరకు తీసుకునే రుణాల పరిమితికి ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే 3.5 నుంచి 5 శాతం గరిష్ఠ మొత్తంలో రుణాలు తీసుకుంటే మాత్రం కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పారు. ఈ రుణ పరిమితి పెంపుతో రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందనిపేర్కొన్నారు.
కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అయితే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందకు నిరంతరం నిధులు విడుదల చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. రూ. 11,092 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. చెల్లింపులలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఆర్బీఐ నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే సౌకర్యాన్ని రాష్ట్రాలకు కల్పించడమే కాకుండా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే పరిమితిని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను వాటాలలో రాష్ట్రాలకు ఏప్రిల్ నుంచి రూ. 46 వేల కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు.
కంపెనీల చట్టం డిఫాల్ట్‌ల డిక్రిమినలైజేషన్
కంపెనీల చట్టం డిఫాల్ట్‌లను డీక్రిమినలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్19 వల్ల దేశవ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించాయి. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో అప్పులు తీర్చలేని వారిని డిఫాల్టర్లుగా భావించరాదు అని, కోవిడ్ బాధితులను డిఫాల్టర్ల జాబితాలో చేర్చలేమమని నిర్మలా సీతారామన్ అన్నారు. దీని ప్రకారం చాలా వరకు కంపెనీ చట్టాల కింద జరిగే ఉల్లంఘనలను నేరరహితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎంఇలకు లబ్ధి చేకూర్చడానికి దివాళా తీసిన కంపెనీ సామర్థ్యాన్ని రూ.1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచినట్లు మంత్రి తెలిపారు. మరో ఏడాది పాటు ఎవరిపైనా దివాళ కేసుల దర్యాప్తులు ఉండవన్నారు మంత్రి నిర్మల ప్రకటించారు. ఇది కార్పొరేట్ గవర్నెన్స్‌లో భారీ సంస్కరణ అని మంత్రి సీతారామన్ తెలిపారు.
టాప్ 100 విశ్వవిద్యాలయాలలో PM eVIDYa ప్రోగ్రాం కింద మే30 లోగా ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభం
భారత ప్రభుత్వం తక్షణమే డిజిటల్ విద్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు. టెక్నాలజీ ఆధారిత విద్యను, డిజిటల్ / ఆన్‌లైన్ విద్యకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు . మే 30, 2020 నాటికి ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించడానికి టాప్ 100 విశ్వవిద్యాలయాలు ఆటోమేటిక్ గా అనుమతించబడతాయి. పాఠశాల విద్య కోసం DIKSHA; ఆన్‌లైన్ కంటెంట్ మరియు క్యూఆర్-కోడెడ్ పాఠ్యపుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
మహిళల జన్ ధన్ ఖాతాలకు రూ .10,025 కోట్లు
జన ధన్ ఖాతాలు ఉన్న 20 కోట్ల మహిళలకు రూ .10,025 కోట్లు వచ్చాయని ఆర్థిక మంత్రి తెలిపారు. భవనం, నిర్మాణ కార్మికులకు రూ .3,950 కోట్లు, 6.81 కోట్ల మందికి ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు అందించినట్లు తెలిపారు. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తొలగింపు, రక్షణలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతానికి పెంపు, ప్యాకేజీ4 ముఖ్యాంశాలు
కరోనావైరస్ లాక్డౌన్ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు జీవం ఇవ్వడానికి ఈనెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ (స్వావలంబన) భారత్ కింద ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ మొత్తం రూ. 20,97,053. ఈ నిధులకు సంబంధించిన కేటాయింపులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విడతల వారీగా ప్రకటించారు. మొదటి విడతలో రూ. 5,94,550 కోట్ల కేటాయింపులు, రెండవ విడతలో 3,10,000 కోట్ల రూపాయలు, మూడవ విడతలో 1,50,000 కోట్లు మరియు మిగిలిన నాల్గవ మరియు ఐదవ వంతుల కేటాయింపుల కోసం రూ .48,100 కోట్లకు సంబంధించిన సమగ్రమైన వివరాలను వెల్లడిస్తూ వచ్చారు.