YS Jagan on Budget: ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి, కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద నిప్పులు చెరిగిన వైఎస్ జగన్

కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి నిలదీశారు.

YS Jagan Mohan Reddy on Laddu (photo/X/YSRCP)

Vjy, Nov 13: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బడ్జెట్‌ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు.. అందుకే ఇంతకాలం బడ్జెట్‌ పెట్టకుండా సాగదీశారు. బడ్జెట్‌ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని తేల్చాయి. బడ్జెట్‌ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌ తెలుస్తుంది.’’ అంటూ విమర్శలు గుప్పించారు.

ఏపీలో త్వరలో 595 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ వేదికగా నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు, 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని వెల్లడి

చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. తర్వాత తన మనుషులతో పదేపదే అబద్ధాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు.ఇవే విషయాలను దత్త పుత్రుడితో మాట్లాడిస్తారు. ఇదంతా ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌కు నిలువెత్తు ఆధారం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారు. సూపర్‌ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు.

YS jagan Press Meet on Budget

మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. మా హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయి. ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి?. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?. అప్పుల పెంపు వార్షిక సగటు చంద్రబాబు హయాంలో కన్నా మా హయాంలో తక్కువ’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన