Ananya Nagalla on Casting Couch: హీరోయిన్స్ క‌మిట్మెంట్ పై అన‌న్య నాగళ్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, వైర‌ల్ అవుతున్న ఆమె వ్యాఖ్య‌లు ఇవిగో..!

వేరే రంగాల్లో అలా ఉండదు. కానీ సినిమా రంగంలో ఉంటుంది అని విన్నాను. మీరెప్పుడైనా ఫేస్‌ చేశారా? అని అడిగింది. దీనికి అన‌న్య గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది.

Ananya Nagalla PIC@ X

Hyderabad, OCT 18: అనన్య నాగళ్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). యువ చంద్ర కృష్ణ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బంధం రేగడ్’, ‘సవారీ’ సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకురి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌గా ఈ మూవీని దీపావళి కానుక‌గా అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానునున్నారు. ఈ సంద‌ర్భంగా నేడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.  అయితే ఈ ట్రైల‌ర్ ఈవెంట్‌లో ఒక మ‌హిళ జ‌ర్న‌లిస్ట్ అనన్య‌ను కాస్టింగ్ కౌచ్‌పై అడుగుతూ.. సినిమా ఛాన్స్‌ ఇచ్చే ముందు హీరోయిన్స్‌ను కమిట్‌మెంట్‌ అడుగుతుంటారు. వేరే రంగాల్లో అలా ఉండదు. కానీ సినిమా రంగంలో ఉంటుంది అని విన్నాను. మీరెప్పుడైనా ఫేస్‌ చేశారా? అని అడిగింది. దీనికి అన‌న్య గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది.

Ananya Nagalla  Against Casting Couch

 

మీరేలా అంత కచ్చితంగా చెబుతున్నారు. మీరు అనుకునేది 100% అబద్ధం. అవకాశం ఇచ్చే ముందు కమిట్‌మెంట్ ఇస్తారు అనేది అబద్ధం అని అనన్య చెప్పింది. అయితే ఆ జ‌ర్న‌లిస్ట్ మ‌రో ప్ర‌శ్న అడుగుతూ.. కమిట్‌మెంట్‌ను బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది దీనిపై ఏమంటారు అని అడుగ‌గా.. మీరు ఎక్క‌డో విన్న మాట‌లు చెబుతున్నారు. కానీ నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. మీరు అనుకున్నది ఇక్క‌డ ఏం లేదు అంటూ అన‌న్య స‌మాధానమిచ్చింది.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్