Asia Cup 2022: అద్భుతమైన ఆరంభం.. శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్‌.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం

ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

Dubai, August 27: ఆసియాకప్‌-2022 (Asia Cup-2022) లో భాగంగా శ్రీలంకతో (Srilanka) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌ (Afghanistan) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది.

శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌ లో రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ (First batting) చేసిన శ్రీలంక.. ఆఫ్గాన్‌ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif