FIR Against Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్.. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నకోర్టు.. అసలేం జరిగింది?
మంత్రిపై కేసు నమోదు చేయాలని బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Newdelhi, Sep 28: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు బిగ్ షాక్ తగిలింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు (Police) చట్టసభ ప్రతినిధుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల పేరిట కొంత మంది పారిశ్రామిక వేత్తలను నిర్మల బెదిరించారని ఆరోపిస్తూ జనాధికారసంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యార్ అనే వ్యక్తి గతంలో తిలక్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని ఆయన తెలిపారు.
ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ముంబై హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు
ఈ క్రమంలోనే ఆదేశాలు
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. పోలీసులపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.. వెంటనే నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.