IPL Auction 2025 Live

Brij Bhushan: బ్రిజ్ భూషణ్ కు చుక్కెదురు! మ‌హిళా రెజ్ల‌ర్లు పెట్టిన కేసులో అభియోగాలు మోపాల‌ని కోర్టు ఆదేశం

ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని (Charged With Harassment) ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది.

WFI Chief Brij Bhushan Sharan Singh (Photo Credit: ANI)

New Delhi, May 10: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు (Brij Bhushan) ఢిల్లీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని (Charged With Harassment) ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. అయితే ఐదు కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు తేల్చింది. మే 21న బ్రిజ్‌ భూషణ్‌పై (Brij Bhushan) అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ఆరో కేసును కొట్టివేసింది. కాగా, బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాలు నమోదుకు సంబంధించిన తీర్పును ఏప్రిల్‌ 18న ఢిల్లీ కోర్టు వెల్లడించాల్సి ఉంది. అయితే 2022 సెప్టెంబర్ 7న డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి తాను హాజరైనట్లుగా వచ్చిన నివేదికలపై విచారణ కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మే 7న తీర్పు వెల్లడించాలని కోర్టు నిర్ణయించింది.

PM Modi in Hyderabad: యూపీఏ హ‌యాంలో హైద‌రాబాద్ లో ఎన్ని పేలుళ్లు జ‌రిగాయో గుర్తు తెచ్చుకోండి! సీఏఏను వ్య‌తిరేకించేవారికి ఈ ఎన్నికల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న ప్ర‌ధాని మోదీ 

మరోవైపు ఉత్తర్వుల పరిశీలన తుది దశలో ఉండటంతో మే 10న తీర్పు ప్రకటిస్తామని మే 7న కోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు శుక్రవారం తుది తీర్పు ఇచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ