KTR Meets Kavitha: ఈడీ ఆఫీసులో తన సోదరిని కలిసిన కేటీఆర్, ఆయన వెంట కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వద్దిరాజు రవిచంద్ర
ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏడు రోజులు కస్టడీకి అనుమతిస్తూ నిన్న తీర్పు ఇచ్చింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర ఉందని కోర్టుకు ఈడీ చెప్పింది.
New Delhi, March 17: ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితను (BRS MLC K Kavitha) ఆమె భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావుతో (Harish Rao) పాటు జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవిత యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయపోరాటం చేద్దామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏడు రోజులు కస్టడీకి అనుమతిస్తూ నిన్న తీర్పు ఇచ్చింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర ఉందని కోర్టుకు ఈడీ చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీలోకి (ED office) తీసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంరెడ్డి తదితరులు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఈడీ కార్యాలయానికి హరీష్ రావు, కేటీఆర్, కవిత భర్త అనిల్, అడ్వకేట్ మోహిత్ రావు చేరుకున్నారు. కాగా ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది.