#SafeHands Challenge: అసలైన సవాల్ ఇదే, సేఫ్‌హ్యాండ్స్ ఛాలెంజ్‌ని విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనా నుండి రక్షించుకోవాలంటే అందరూ పార్టిసిపేట్ చేయాలని పిలుపు

ఇందులో భాగంగా #SafeHands Challenge అనే కొత్త సవాలును ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియోని విడుదల చేసింది.ఈ గేమ్ యొక్క ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. దీని ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రభావవంతమైన వైరస్ బదిలీని నియంత్రించడానికి ఒక ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది.. మీ చేతుల్లో ఉండే వైరస్ నుండి బయటపడటానికి తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు.

Coronavirus: WHO Launches SafeHands Challenge To Prevent Coronavirus(Photo-pixabay)

New Delhi, Mar 17: చైనాలో 2019లో కనుగొన్న కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. దీని దెబ్బకు ప్రపంచం (World) అన్ని రంగాల్లో భారీగా దెబ్బతింది. దీని నివారణకు సరైన చికిత్స లేకపోవడంతో ఈ వైరస్ భారీన పడిన వారే సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

కరోనా కట్టడిలో కీలకమలుపు

ఈ వైరస్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ (WHO) ఆరోగ్య సంక్షోభంగా (Global health crisis) వర్ణించి అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా #SafeHands Challenge అనే కొత్త సవాలును ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియోని విడుదల చేసింది.

భారత్‌లో మూడో కరోనావైరస్ మరణం నమోదు

ఈ గేమ్ యొక్క ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. దీని ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రభావవంతమైన వైరస్ బదిలీని నియంత్రించడానికి ఒక ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది.. మీ చేతుల్లో ఉండే వైరస్ నుండి బయటపడటానికి తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు.

కరోనావైరస్ తో పోరాడటానికి ముందుగా శుభ్రమైన చేతుల శక్తిని ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ హ్యాండ్స్ సవాలును ప్రారంభించింది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చేతులు కడుక్కునే వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని WHO కోరింది.

Here's WHO Video

ప్రపంచ ఆరోగ్య సంస్థ షేర్ చేసిన వీడియో ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ తీసుకోవడానికి ప్రజలను ఆహ్వానించింది. కొత్త కరోనావైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు అనేక ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) ఈ వీడియోలో పేర్కొన్నారు. సబ్బు మరియు నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ ఉపయోగించి సాధారణ, సురక్షితమైన మరియు సమర్థవంతమైన చేతి పరిశుభ్రత చాలా ముఖ్యమైనదని తెలిపారు.

Here's Tedros Adhanom Ghebreyesus  Challenge Tweet

ఆ వీడియోలో, అతను చేతులు కడుక్కోవడానికి సరైన మార్గాన్ని కూడా చూపించాడు. "మీరు కూడా ఎక్కడైనా సురక్షితమైన మరియు శుభ్రమైన చేతులు కలిగి ఉంటారు. ఇప్పుడు నేను కరోనావైరస్ కోసం సిద్ధంగా ఉండటానికి WHO సేఫ్ హ్యాండ్స్ సవాలును తీసుకోవాలని ప్రపంచాన్ని పిలుస్తున్నాను" అని ఘెబ్రేయేసస్ వీడియోలో జత చేశాడు.

కరోనా దెబ్బ, షిర్డీ ఆలయం మూసివేత

ఇప్పుడు ప్రముఖులంతా ఈ SafeHands Challenge సవాలును స్వీకరించి తమ వీడియోలను సోషల్ మీడియా ద్వారా  పంచుకుంటున్నారు. అన్ని వైరల్ అయినట్లుగా గానే ఇది వైరల్ గా మారడానికి కరోనా నుండి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరు ఈ సవాలును స్వీకరిస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు మీరు కూడా స్వీకరించండి