D.K.Shivakumar Kabali look: నేను వచ్చేశా, కబాలి లుక్‌తో అదరగొడుతున్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, 50 రోజుల తర్వాత సొంతగడ్డ మీదకు, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్, తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్
ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
Bangalure, October 26: మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా ఈనెల 23న శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 3న శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత కోర్టు తీర్పు మేరకు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు.
శివకుమార్ కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని, విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. దీంతో పాటుగా రూ. 25 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
అందరి ఆశీస్సులతో నాకు బెయిల్ : శివకుమార్
D.K. Shivakumar gets bail in Money ... g Case today lands in Bengaluru.txt
Displaying D.K. Shivakumar gets bail in Money Laundering Case today lands in Bengaluru.txt.
గతంలో అనేక మార్లు అయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తాజాగా అయన మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. అందరి ఆశీస్సులతో నాకు బెయిల్ లభించింది. జైల్లో ఉన్నపుడు మానసికంగా కృంగిపోయాను. చేయని నేరానికి అనవసరంగా జైల్లో వేశారని మధనపడ్డాను. కానీ, ఈ సమయంలో నాకు అండగా నిలిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. కాగా శివకుమార్ మాట్లాడుతున్నపుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
బెంగుళూరు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ అన్నారు. తనకు బెయిల్ వచ్చిందని... తిరిగి వచ్చేశానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. జైలులో తనను కలిసి ఆమె తనలో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు. కాగా బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జైల్లో ఉన్న డీకే శివకుమార్‌ను కలిసిన విషయం విదితమే.
ఇదిలా ఉండగా మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరుగనుంది.
శివకుమార్ రాక సందర్భంగా బెంగళూరులో విజయోత్సవం జరపాలని అభిమానులు నిర్ణయించారు. ఈ సంధర్భంలోనే ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమాలోని రజనీకాంత్ గెటప్ లాగే డీకే శివకుమార్ తెలుపు, నలుపు రంగులో ఉన్న వెంట్రుకలతో జైల్లో గడ్డం పెంచుకుని బెయిల్ మీదకు బయటకు వచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ స్టైల్ లో డీకే. శివకుమార్ తన అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాషన్ లోకంలో నలుపు, తెలుపు రంగులో గడ్డం పెంచుతున్నవారిని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో పిలుస్తుంటారు. ఇప్పుడు డీకే. శివకుమార్ ను ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ‘‘ మీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సూపర్’’ అంటున్నారు.
ప్రతినిత్యం గడ్డం నీట్ గా షేవ్ చేసుకుని దర్శనం ఇచ్చే డీకే. శివకుమార్ బెంగళూరు వచ్చిన తరువాత తన కులదైవాన్ని దర్శించుకుని నీట్ గా గడ్డం షేవ్ చేసుకుంటారని ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు. మొత్తం మీద ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ న్యూ లుక్ కు సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతున్నారు.