Half-a-day Schools: తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు, నెల తర్వాత వేసవి సెలవులు, ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర విద్యాశాఖ

ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12, 2020న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి......

Representational Image (Photo credits: Pixabay)

Hyderabad, March 11:  వేసవి ప్రారంభం అవడంతో తెలంగాణ (Telangana) రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం ఒంటి పూట బడులను (Half a day schools) ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు దినంలో ఒక పూట వరకు మాత్రమే పనిచేయాలి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఇంఛార్జ్ కమిషనర్ చిత్ర రామచంద్రన్ (Chitra Ramachandran) ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నిబంధనలు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్లలో నడిచే ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనల అమలు విషయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్య యొక్క ప్రాంతీయ ఉమ్మడి డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులందరికీ చిత్ర రామచంద్రన్ దిశానిర్దేశం చేశారు.

కాగా, ఒంటి పూట బడులు ప్రారంభమైన దగ్గర్నించీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

ఇక ఏప్రిల్ 23 ఈ విద్యా సంవత్సరానికి చివరిరోజు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12, 2020న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి