AP EAPCET 2023 Hall Tickets Out: ఏపీ ఈఏపీసెట్ హాల్ టిక్కెట్లు విడుదల, హాల్ టిక్కెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..
ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్ టిక్కెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి. వీటిల్లో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి.
ఈ నెల 15 నుంచి 19 తేదీల మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని అధికారులు చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయంలో సందేహాలున్న వారు 08554-23411, 232248 ఫోన్ నెంబర్ల ద్వారా సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. మంగళవారం నుంచి అభ్యర్థులకు cets.apsche.ap gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు అందించనున్నారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
రెండు స్ట్రీమ్‌లకు సంబంధించిన AP EAPCET 2023 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీలు మే 24న APSCHE వెబ్‌సైట్‌లో ప్రచురించబడతాయి. AP EAPCET పరీక్ష అనేది జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలలు అందించే వివిధ వృత్తిపరమైన కోర్సులలో ప్రవేశానికి సంబంధించినది.
AP EAPCET 2023 పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా జరుగుతుంది . పేపర్ మొత్తం 160 ప్రశ్నలతో పాటు మొత్తం 160 మార్కుల వెయిటేజీని కలిగి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం ఇస్తారు.
మొత్తం 47 పరీక్ష కేంద్రాలు
మన రాష్ట్రంలో 45, హైదరాబాద్‌లో రెండు కలిపి మొత్తం 47 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అనకాపల్లి, అనంతపురం, గుత్తి, తాడిపత్రి, మదనపల్లి, రాజంపేట, బాపట్ల, చీరాల, చిత్తూరు, పలమనేరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, మైలవరం, తిరువూరు, విజయవాడ, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీకాకుళం, టెక్కలి, గూడూరు, పుత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, బొబ్బిలి, రాజాం, విజయనగరం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కడప, ప్రొద్దుటూరుల్లోను, హైదరాబాద్‌లో ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
How to download AP EAPCET 2023 hall ticket
Step – 1 Visit the official website of the Andhra Pradesh State Council of Higher Education (APSCHE) and click on the link for AP Common Entrance Tests (CETS) 2023.
Step – 2 Select AP EAPCET 2023 and then click on “Download Hall Ticket”.
Step – 3 Enter your registration number or payment reference id, qualifying examination hall ticket no. and date of birth and click on “Proceed”.
Step – 4 Your AP EAPCET 2023 hall ticket will be displayed on your screen.
Step – 5 Check the hall ticker thoroughly and make sure that all your details are correct. Download the hall ticket and take a printout.
The preliminary keys for the AP EAPCET 2023 exam for both streams will be published on the APSCHE website on May 24.