CBSE 10th Result Declared: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను విద్యార్థులు results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోండి

ముందుగా చెప్పినట్లుగానే టెన్త్ ఫలితాలను బుధవారం నాడు సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. రెండు రోజుల క్రితం 12వ తరగతి రిజల్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ రిజల్ట్స్‌పై ఉత్కంఠ పెరిగింది. సుమారు 18 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

CBSE-10th-Board-Exam-Result

New Delhi, July 15: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలు (CBSE Class 10 Exam Result 2020) విడుదల అయ్యాయి. ముందుగా చెప్పినట్లుగానే టెన్త్ ఫలితాలను బుధవారం నాడు సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. రెండు రోజుల క్రితం 12వ తరగతి రిజల్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ రిజల్ట్స్‌పై ఉత్కంఠ పెరిగింది. సుమారు 18 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, పదో తరగతి ఫలితాలు కూడా త్వరలో విడుదల, ఫలితాలను http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ ద్వారా చెక్ చేసుకోండి

విద్యార్థులు ఫలితాలను results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 12వ తరగతి లాగే 10వ తరగతి ఫలితాల్లో కూడా మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు. సీబీఎస్ఈ. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

CBSE Class 10 Results: ఫలితాలు చెక్ చేయడం ఎలా ?

విద్యార్థులు ముందుగా cbseresults.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో క్లాస్ 10 ఫలితాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. విద్యార్థులు తమ వివరాలతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజీలాకర్‌, మైక్రోసాఫ్ట్, ఉమాంగ్ యాప్స్‌లో కూడా విద్యార్థులు ఫలితాలు చెక్ చేయొచ్చు. ఐవీఆర్ఎస్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు <CBSE10>space<Roll no>space<Admit card id> అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. 011-224300699 నెంబర్‌కు కాల్ చేసి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా బోర్డు పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ వెల్లడించింది . ఈ ఫలితాలతో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నట్టైతే పెండింగ్‌లో ఉన్న పరీక్షలు రాయొచ్చు. ఈ షెడ్యూల్‌ను సీబీఎస్ఈ తర్వాత ప్రకటించనుంది .



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..