Telangana CETs 2021: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం కొత్త షెడ్యూల్ విడుదల, ఆగష్టు 4 నుంచి 10 తేదీ వరకు ఎంసెట్, పాత షెడ్యూల్ ప్రకారమే లాసెట్- ఎడ్ సెట్ పరీక్షలు

ఆగస్టు 4 నుంచి 10 వరకు ఇంజనీరింగ్- అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 (టిఎస్ ఎంసెట్ -2021)...

Representational Image | File Photo

Hyderabad, June 22: తెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఇంజనీరింగ్- అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 (టిఎస్ ఎంసెట్ -2021) ను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 4, 5 మరియు 6 తేదీలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ పరీక్ష అలాగే ఆగస్టు 9 మరియు 10 తేదీలలో అగ్రికల్చర్- మెడిసిన్ స్ట్రీమ్‌ పరీక్ష నిర్వహించబడుతుంది.

ఈ ఏడాది ఆగష్టు చివరి నాటికి పూర్తి చేయాలని ఐసెట్, ఈసెట్ సహా మొత్తం ఏడు సెట్ల పరీక్షల (సిఇటి) ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాలిసెట్ పరీక్ష జూలై 17వ తేదీన, ఈసెట్ ఆగష్టు 3న  జరుగుతుందని ప్రకటించారు.

కాగా, ఐసెట్, లాసెట్ మరియు ఎడ్ సెట్ పరీక్ష తేదీలలో ఎటువంటి మార్పు లేదు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే, ఐసెట్ 2021 ఆగస్టు 19 మరియు 20 తేదీలలో, అలాగే లాసెట్ ఆగస్టు 23వ తేదీన మరియు ఎడ్ సెట్ ఆగస్టు 24 మరియు 25 తేదీలలో జరుగుతున్నాయి.

ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా సెమిస్టర్ పరీక్షలను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ -19 మార్గదర్శకాలను కఠినంగా అమలుపరుస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. డిగ్రీ, పీజీ ప్రత్యక్ష క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు, ఇక ఇంటర్ ఫలితాలు కూడా మరో వారం రోజుల్లోగా విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?

Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం