Summer Holidays Extended: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగించిన తెలంగాణ విద్యాశాఖ, ఆన్‌లైన్ విధానంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ

తెలంగాణలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది....

Representational Image | File Photo

Hyderabad, June 16: తెలంగాణలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గల ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు డైట్ కాలేజీలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణలో అంతకుముందు మే31 వరకు వేసవి సెలవులు ప్రకటించగా, లాక్డౌన్ కారణంగా జూన్ 15 వరకు సెలవులను పొడగించారు. అయితే సెలవులు నిన్నటితో ముగిసిపోయినప్పటికీ ఈరోజు నుంచి స్కూళ్లు తెరవాలా? వద్దా? అనే దానిపై ఎలాంటి ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం లేదు. మరికొన్ని కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల లింక్‌లను మరియు మొదటి రోజు తరగతుల టైమ్‌టేబుల్‌ను కూడా పంపించాయి. ఇలాంటి సందిగ్ధంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని సెలవులను మరో 5 రోజుల పాటు పొడగించాలని నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 21 నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరై, విద్యార్థుల అడ్మిషన్లను పూర్తి చేస్తే.. జూలై 1 నుంచి ఆన్‌లైన్ విధానంలోనే తరగతులను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ఇంటర్ కాలేజీలలో ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  సెకండ్ ఇయర్ సిలబస్ జూలై 1 నుంచి ప్రారంభించాలని ఇప్పటికే ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది.

ఇక, కోవిడ్ కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif