TS POLYCET Results 2021: పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు, విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలు, ఫలితాలను ఎలా డౌన్లో‌డ్ చేసుకోవాలో కథనంలో తెలుసుకోండి

రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల (Telangana TS POLYCET Result 2021 Declared) చేసింది.

Representational Image (Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (TS POLYCET Results 2021) నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల (Telangana TS POLYCET Result 2021 Declared) చేసింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ శ్రీనాథ్‌ పాల్గొన్నారు. ఈ పరీక్షలకు 97,557 మంది హాజరయ్యారు. ఎంపీసీ విభాగంలో 81.75శాతం మంది, బైపీసీ విభాగంలో 76.42శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుంది. నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ నిర్వహిస్తారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి.

టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎస్బీటీఈటీ, ఆగ‌స్టు 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23న తుది విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 1న నుంచి పాలిటెక్నిక్‌ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. సెప్టెంబరు 9న స్పాట్ ప్రవేశాలకుగాను మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఫలితాలను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

* ముందుగా టీపాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ tspolycet.nic.in.లోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న టీఎస్‌ పాలిసెట్‌ రిజల్ట్స్‌ 2021పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత హాల్‌ టికెట్ నెంబర్‌ను ఎంటర్‌ చేసి వ్యూ ర్యాంక్‌ కార్డును క్లిక్‌ చేయాలి.

* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై దర్శనమిస్తుంది.

* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రింట్ తీసుకుకోవాల్సి ఉంటుంది.