Tamil Nadu 12th Board Exams 2021: 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు, కరోనా వ్యాప్తి వేళ కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్ సర్కారు, కమిటీ ఇచ్చిన స్కోర్ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడి
రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు (TN government cancels 12th class board exams) చేస్తున్నట్టు ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం (Tamil Nadu 12th Board Exams 2021) తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు.
Chennai, June 6: తమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు (TN government cancels 12th class board exams) చేస్తున్నట్టు ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం (Tamil Nadu 12th Board Exams 2021) తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. మార్కులు కేటాయించే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ స్కోర్ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటానికి తోడు థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులతో మూడు రోజులుగా జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ ఏడాది ఇంటర్ బోర్డు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించినట్టు స్టాలిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే విద్యార్థులకు మార్కుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నీట్ సహా అన్నిజాతీయ స్థాయి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మరోవైపు తమిళనాడులో ఈ ఒక్కరోజే 21,410 కొత్త కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి.