Dehradun Rape Case: డెహ్రాడూన్‌ లో ఘోరం.. బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఐదుగురు దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపించిన బాలిక.. నిందితుల అరెస్ట్

ఈ నెల 12న అర్ధరాత్రి ఓ 15 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ మేరకు ఆ బాలికే వెల్లడించింది.

Representational Image (File Photo)

Newdelhi, Aug 19: ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ (Dehradun Rape Case) లో ఘోరం జరిగింది. ఈ నెల 12న అర్ధరాత్రి ఓ 15 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి (Gang Rape) జరిగింది. ఈ మేరకు ఆ బాలికే వెల్లడించింది. బస్టాండ్ దగ్గర నిలిపి ఉంచిన బస్సులో తాను ఎక్కగా.. ఐదుగురు అపరిచితులు తనపై  లైంగిక దాడి చేశారని ఆరోపించింది. బస్టాండ్‌ లోని ఓ దుకాణం కాపలాదారు బాలిక దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, బాధితురాలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు అర్థమవుతున్నది. కాగా ఈ ఘటనతో బాలిక అలా అయ్యిందా? అంతకు ముందే ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయా? తెలియాల్సి ఉంది.

‘అసలు అత‌డు మ‌గాడే కాదు’.. రాజ్ తరుణ్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యువ‌తి.. వీడియో ఇదిగో

ఐదుగురి అరెస్ట్

ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలికకు చేయించిన వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగిన బస్సుతో పాటు, మరో బస్‌ ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపారు.

బాలయ్య ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు హాజరుకానున్న మెగాస్టార్



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif