Angry Boy friend sets fire to School: ఇదేందయ్య.. ఇది..!! గర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని తగలెట్టేశావా... వార్నీ!
మరో విషయం తెలిస్తే అవాక్కవుతారు.
Cairo, August 28: కొన్ని వార్తలు చూడగానే.. ఇదెక్కడి ఘోరం అనాలనిపిస్తుంది. ఇదీ అలాంటి వార్తే. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్ ఫెయిలైందన్న కోపంతో చేసిన పని కొంతమంది విద్యార్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వివారాల్లోకెళ్తే... ఈజిప్టులోని 21 ఏళ్ల యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ చదువుతున్న స్కూల్‌కి నిప్పుపెట్టాడు. కారణం ఆమె ఎగ్జామ్‌లో ఫెయిలవ్వడమే. ఆ కోపంతోనే ఈ పెద్ద మనిషి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చే అంశం. కాగా, సదరు నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన గర్ల్ ఫ్రెండ్ తనకు కాబోయే భార్య అని, ఎగ్జామ్ ఫెయిలవ్వడంతో ఆమె మరో ఏడాది చదువుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందువల్ల తమ పెళ్లి వాయిదా పడుతుందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పుకొచ్చాడు. అవాక్కయ్యారు కదూ.