Onion Import: ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం, విదేశాల నుంచి లక్ష టన్నుల ఉల్లిపాయలు దిగుమతి, నాఫేడ్‌కు దేశ వ్యాప్తంగా పంపిణీ చేసే బాధ్యతలు అప్పగింత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడి

డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అక్టోబర్ నుంచి ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. తుఫాను దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో పంట పూర్తిగా దెబ్బతింది.

Govt to import 1 lakh tonnes onion to check price rise, says Ram Vilas Paswan ( Photo-pexels )

New Delhi, November 10: దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు (Onion Price) ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అక్టోబర్ నుంచి ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. తుఫాను దెబ్బ(Cyclone Effect) కు కొన్ని రాష్ట్రాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో ఉల్లి ధర రూ.100 ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో భాగంగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం మరిన్ని చర్యల్ని చేపట్టింది.

రిటైల్ మార్కెట్లో కిలోకు సుమారు రూ.100 వరకు పెరిగిన నేపథ్యంలో ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం(Govt to import 1 lakh tonnes onion) నిర్ణయించింది. విదేశాల నుంచి లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

కేంద్ర మంత్రి ట్వీట్ 

ఢిల్లో కార్యదర్శలు కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ (Food and Consumer Affairs Minister Ram Vilas Paswan)ట్విటర్ ద్వారా వెల్లడించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15లోగా ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేస్తామని, ఉల్లి ధరలు నియంత్రించడానికి లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 15లోగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంఎంటీసీ(MMTC)కి కేంద్ర ప్రభుత్వం సూచించింది.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని సరఫరా చేసే బాధ్యతలు నాఫేడ్ (Nafed ) సంఘానికి అప్పగించినట్లు ట్వీట్ లో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎంఎంటిసి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుందనీ, దేశీయ మార్కెట్లో కీలకమైన నాఫెడ్ వీటిని సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు.