Tough Fight in Haryana: రసవత్తరంగా మారిన హర్యానా, హంగ్ దిశగా ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారనున్న ఇండిపెండెంట్లు, పూర్తి ఫలితాలు మరి కాసేపట్లో..

ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు. హంగ్ దిశగా ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. అక్కడ హంగ్‌ దిశగా ఫలితాల సరళి సాగుతుండటంతో ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Haryana results 2019 live updates -independents-emerges-key-members

Chandigarh, October 24: హర్యానా ఎన్నికలు ఫలితాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు. హంగ్ దిశగా ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. అక్కడ హంగ్‌ దిశగా ఫలితాల సరళి సాగుతుండటంతో ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల సంఖ్య 46..అయితే మేజిక్‌ మార్క్‌కు చేరువగా బీజేపీ నిలిచిపోవడంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది అక్కడ ఉత్కంఠగా మారింది. మరోవైపు చిన్న పార్టీ జేజేపీని తనవైపు తిప్పకుని ఆ పార్టీకి సీఎం పదవి ఆఫర్‌ చేయడం ద్వారా బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఇక మేజిక్‌ ఫిగర్‌కు ఒకట్రెండు స్ధానాలే తగ్గడంతో చిన్న పార్టీల్లో రెబెల్స్‌ను బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

మొత్తంమీద హరియాణాలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి అనుకూల పరిస్థితి ఉందనేది వెల్లడవనుంది.