Bank holidays in May 2022: బ్యాంక్ కస్టమర్లు అలర్ట్, మే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకుని ముందే ప్రిపేర్ అవ్వండి
చాలా మంది బ్యాంకులో (Bank holidays in May 2022) అత్యవసర పనులుంటాయి. కొంత మంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వచ్చే నెలలో మీరు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి. ప్రతి నెల బ్యాంకులకు సెలవులనేవి అంటాయి.
బ్యాంకు కస్టమర్లకు గమనిక. చాలా మంది బ్యాంకులో (Bank holidays in May 2022) అత్యవసర పనులుంటాయి. కొంత మంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వచ్చే నెలలో మీరు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి. ప్రతి నెల బ్యాంకులకు సెలవులనేవి అంటాయి. అయితే ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు ఉన్నాయనే విషయాన్ని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీని ప్రకారం మే నెలలో బ్యాంకులకు 11 రోజులు (Offices to remain closed for 11 days) సెలవులున్నాయి. ఈ సెలవులనేవి జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల పరంగా కూడా కొన్ని సెలవులున్నాయి.
కాగా ఈద్-ఉల్-ఫితర్ మరియు బుద్ధ పూర్ణిమ సందర్భంగా వచ్చే నెలలో రెండు సుదీర్ఘ వారాంతాలు ఉన్నాయి - బ్యాంకులు వరుసగా 3 రోజులు మూసివేయబడతాయి. ఇవి కాక రెండవ శనివారం, అలాగే ఆదివారాలు కూడా వస్తున్నాయి. రాబోయే నెలలోపు కీలకమైన బ్యాంక్-సంబంధిత పనిని కలిగి ఉన్న వ్యక్తులు, బయటకు వెళ్లే కంటే ముందుగానే చెక్‌లిస్ట్‌ను పరీక్షించాలి.
మేనెలలో బ్యాంకులకు సెలవులు ..
మే 1 : ఆదివారం , మేడే
మే 2 : సోమవారం, మహర్షి పరుశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
మే 3 : మంగళవారం, ఈద్ ఉల్ ఫితర్, బసవ జయంతి,( కర్ణాటక)
మే 4 : బుధవారం, ఈద్ ఉల్ ఫితర్( తెలంగాణ)
మే 8 : ఆదివారం
మే9 : సోమవారం, రవీంద్ర నాధ్ ఠాగూర్ జన్మదినం (పశ్చిమ బెంగాల్, కలకత్తా, త్రిపుర)
మే 14 : రెండో శనివారం
మే15 : ఆదివారం
మే 16 : సోమవారం, బుద్ధ పూర్ణిమ, బ్యాంకు సెలవు
మే 24 : మంగళ వారం, ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టిన రోజు (సిక్కిం)
మే 28 : నాలుగో శనివారం, అన్ని చోట్ల సెలవు
మే 29 : ఆదివారం