CRPF Constable Recruitment: లక్షా ముఫ్పై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

తాజాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను (CRPF Constable Recruitment) హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.

CRPF (Photo-ANI)

CRPF Constable Recruitment 2023:నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను (CRPF Constable Recruitment) హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కేంద్రం రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,29,929 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుంది.

మరో వేవ్ వచ్చేసిందా.. భారత్‌లో భారీగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 5,335 మందికి కరోనా, 25,587కి చేరుకున్న యాక్టివ్ కేసులు

వీటిలో 1,25,262 పోస్టులు పురుషులకు.. 4,467 పోస్టులు మహిళలకు కేటాయించగా.. కానిస్టేబుల్ పోస్టుల్లో రిక్రూట్‌మెంట్ కోసం10 శాతం ఖాళీలు ఎక్స్-అగ్నివీర్లకు కేటాయించడం గమనార్హం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

Here's ANI Tweet

ఈ పోస్టులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అధికారులు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపిక అనంతరం ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి వేతనాల విషయానికొస్తే.. రూ. 21,700- 69,100 మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా ప్రకటించలేదు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక సీఆర్‌పీఎఫ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.