Cyclone Burevi: మళ్లీ బురేవి తుఫాన్ దూసుకొస్తోంది, కేరళలో నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్, డిసెంబర్ 2వ తేదీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తమిళనాడుకు తప్పని మరో ముప్పు

తాజాగా బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన మరో అల్పపీడనంతో తమిళనాడు, కేరళలోని నాలుగు జిల్లాలో రెడ్ అలర్ట్ (Red Alert Issued in Four Districts) ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్చలు చేపట్టాయి.

heavy-rainfall-warning-to-AP(Photo-ANI)

Kozhikode, November 30: నివర్ తుఫాను మిగిల్చిన విషాదం మరువక ముందే మరో తుఫాను (Cyclone Burevi) విరుచుకుపడానికి రెడీ ఉంది. తాజాగా బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన మరో అల్పపీడనంతో తమిళనాడు, కేరళలోని నాలుగు జిల్లాలో రెడ్ అలర్ట్ (Red Alert Issued in Four Districts) ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్చలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని అధికారులకు హెచ్చరికలు జారీ చేశాయి. కేరళ రాష్ట్రంలో కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, అలప్పుజా, కొల్లాం, పతనమిట్టా జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను (Heavy Rains in Kerala) ఐఎండీ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ‘బురేవి’ (Burevi Cyclone) అని నామకరణం చేశారు. ఈ తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మొన్నటి వరకు నివర్ తుఫానుతో తీవ్ర నష్టం జరిగింది. తాజాగా బురేవి ఏ విధంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ తుఫానుతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ వాయుగుండం, తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా వాతావరణంలో మార్పు ఏర్పడి చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉండవచ్చు.

మరో తుఫాను ముప్పు, 4 రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రెండో తేదీన బురేవి తుపాన్‌గా అవకాశం

దీని ప్రభావంతో మంగళవారం నుంచే భారీ వర్షాలు పడుతాయని, 48 గంటల పాటు దాని తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు పువియరాసన్ చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సైతం భారీగా తగ్గుతుందని చెప్పారు. వరుస తుఫాన్ల హెచ్చరికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలర్ట్ అయింది. వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో ఏపీ సర్కార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి సారించి అధికారులను అప్రమత్తం చేసింది.