Earthquake In Nicobar Islands: నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైన భూకంప తీవ్రత, భయాందోళనకు గురయిన ప్రజలు

నికోబార్ దీవుల్లో(Nicobar Islands region) గురువారం అర్దరాత్రి దాటాక భూమి ప్రకంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. నికోబార్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు( India Meteorological Department) చెప్పారు.

Earthquake measuring 5.0 hits Nicobar Islands, no casualties reported Representational Image | Photo- Pixabay

New Delhi, November 15: బంగాళాఖాతానికి దక్షిణాన హిందూ మహసముద్రంలో ఉన్న నికోబార్ దీవుల్లో శుక్రవారం భూప్రకంపనలు (major earthquake) సంభవించాయి. నికోబార్ దీవుల్లో(Nicobar Islands region) గురువారం అర్దరాత్రి దాటాక భూమి ప్రకంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు.

నికోబార్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు( India Meteorological Department) చెప్పారు. అయితే ఈ భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని నికోబార్ అధికారులు చెప్పారు.

అండమాన్ నికోబార్ దీవుల చరిత్రను చూస్తే... బ్రిటీష్‌వారి హయాంలో భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు అనేక రకాల శిక్షలు విధించి ఇక్కడికి తరలించేవారు. అదంతా 19వ శతాబ్దంనాటి విషయమైనా.. ఇప్పుడు ఈ దీవుల్లో మూడు లక్షల మందికి పైబడే ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు వలస వచ్చి స్థిరపడిపోయారు.ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, విభిన్న సంస్కృతులకు చెందినవారు జీవిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని మినీ ఇండియా అనికూడా పిలుస్తుంటారు.

ANI Report

అండమాన్ నికోబార్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో పదిహేను రోజులపాటు ఉత్సవాలు జరుపుతుంటుంది. ఎకో-ఫ్రెండ్లీ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగానూ ఈ ఉత్సవాలలో సంగీత, నృత్య, వాయిద్య రంగాలలో ప్రముఖ కళాకారుల బృందాలతో కార్యక్రమాలు జరుగుతాయి.

అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడి "హవెలాక్ ద్వీపం"లో సుభాష్ మేళాను నిర్వహిస్తారు. ఇందులో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను, వేడుకలను నిర్వహిస్తారు. ఇంకా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ప్రతియేటా జనవరిలోనే "నీల్ ద్వీపం"లో వివేకానంద మేలాను జరుపుతారు.