Rains in Hyderabad: హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Hyderabad, Sep 4: ఈశాన్య బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో (Hyderabad) వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో రెండు, మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక
Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి
9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
Viral Video: రైలులో మహిళ పర్సు చోరీ.. కిటికీకి దొంగ వేలాడదీత.. వైరల్ వీడియో