PF Withdrawal: మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటున్నారా? ఏయే సందర్భాల్లో, ఎంత డబ్బు విత్ డ్రా చేయవచ్చో తెలుసుకోండి.

అవసరాన్ని బట్టి రుణం కూడా తీసుకునే వీలుంది. మీ పీఎఫ్ డబ్బుకు టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగాలున్నాయో సవివరంగా..

Image used for representational purpose only | (Photo Credits: File Photo)

ఏ ఉద్యోగి అయినా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వెబ్‌సైట్ (EPFO https://www.epfindia.gov.in)  ద్వారా వారి పీఫ్ ఖాతా  లోంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. నగదు విత్‌డ్రా (PF Withdrawals) కోసం అవసరమయ్యే ప్రక్రియనంతా ఆ ఉద్యోగి అప్లికేషన్ ఫిల్ చేసిన 3 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

చందాదారుడు (PF Contributor) ఎవరైతే తమ పీఫ్ ఖాతాను బ్యాంక్ ఖాతాతో జత చేస్తారో ఈ సదుపాయాన్ని కలిగి ఉంటాడు.

ఉద్యోగి పీఎఫ్ అకాంట్ (PF Account)లో  ఆ ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం, మరికొంత మొత్తం కంపెనీ తరఫున ప్రతీనెల డబ్బు జమ అవుతూ ఉంటుంది. కానీ ఈ మొత్తాన్ని ఉద్యోగి రిటైర్మైంట్ తర్వాతనే విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా పీఎఫ్ ఖాతాలో జమ చేయబడిన దానిలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది.

అయితే ఎంత మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది సదరు ఉద్యోగి సర్వీసు కాలం, అతడి అవసరంపై ఆధారపడి ఉంటుంది.

ఏయే సందర్భాల్లో పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు?

మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం.

ఉద్యోగి లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వైద్యం కోసం  డబ్బు అవసరం ఏర్పడినట్లయితే, ఎప్పుడు కావాలన్నా డబ్బు తీసుకోవచ్చు.

ఇందుకోసం ఆ వ్యక్తి హాస్పిటల్ లో అడ్మిట్ కాబడి కనీసం నెల రోజులు అయి ఉండాలి.

డబ్బు విత్ డ్రా కోసం ఫాం 31  నింపాల్సి ఉంటుంది. అలాగే హాస్పిటల్ లో అడ్మిట్ అయిన డాక్యుమెంట్లు, ఆఫీస్ లో సెలవుకు సంబంధించిన డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.

వివాహం లేదా విద్య కోసం.

ఉద్యోగి పిల్లలు లేదా తోబుట్టువుల విద్యా లేదా వివాహ ఖర్చుల నిమిత్తం డబ్బు తీసుకోవచ్చు. ఇందుకోసం కనీసం 7 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సందర్భంలో పీఎఫ్ ఖాతాలో జమ చేయబడిన మొత్తంలో నుంచి 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.

ప్లాట్ కొనుగోలు లేదా ఇలు కట్టుకోవడానికి

కనీసం 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు ఇందుకు అర్హులు.

భూమి లేదా ఇంటికి సంబంధించిన పత్రాలు ఉద్యోగి లేదా తన జీవిత భాగస్వామి పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి.

ప్రాపర్టీకి సంబంధించి న్యాయపరమైన ఎలాంటి చిక్కుముడులు ఉండకూడదు.

ఇలాంటి సందర్భంలో పీఎఫ్ ఖాతాల్లో జమ కాబడిన మొత్తానికి 36 రేట్లు ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసుకునే వీలుంటుంది.

ఇంటి రుణం తీర్చుటకు

కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు ఇందుకు అర్హులు.

ఇంటిపై ఉన్న లోన్ తీర్చాటానికి వారి పీఎఫ్ ఖాతాల్లో జమ కాబడిన మొత్తానికి 36 రేట్లు ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసుకునే వీలుంటుంది.

ఉన్న ఇంటిని బాగు చేసుకోవటానికి

కనీసం 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు ఇందుకు అర్హులు.

ఇలాంటి సందర్భంలో పీఎఫ్ ఖాతాల్లో జమ కాబడిన మొత్తానికి 12 రేట్లు ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసుకునే వీలుంటుంది.

ముందస్తు పదవి విరమణ చేస్తే

ఆ సమయానికి ఉద్యోగి 54 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఈ సందర్భంలో పీఎఫ్ ఖాతాలో జమ చేయబడిన మొత్తంలో నుంచి 90% మించి విత్ డ్రా చేసుకునే వీలు లేదు.