IBPS Clerk 2023: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4545 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఐబీపీఎస్, పూర్తి వివరాలు ఇవిగో..
ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులలో ఖాళీలను భర్తీ చేయనుంది.
IBPS Clerk Notification 2023 Out: 2023 సంవత్సరానికి గానూ 4545 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జులై 21 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు.
మొత్తం పోస్టులు : 4045
పోస్టులు : క్లర్క్ పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 20-28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రెండు దశల్లో కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ (సీబీటీ) ఉంటుంది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ : జులై 21
దరఖాస్తు ఫీజు : రూ. 850. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 175)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: 2023 అక్టోబరులో ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.ibps.in/