June Rainfall Update: జూన్ నెలలో కరుణ చూపని వానదేవుడు, 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపిన ఐఎండీ, వచ్చే నెలపైనే ఆశలు..

దేశంలోకి జూన్‌ 1న రుతుపవనాల ఆగమనం తర్వాత ఈ నెలలో ఇప్పటివరకు 20 శాతం తక్కువ వర్షపాతం (Rainfall) నమోదైనట్లు ‘భారత వాతావరణ విభాగం (IMD)’ వెల్లడించింది.జూన్ ఒక‌టో తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు కేవ‌లం 64.5 ఎంఎం వ‌ర్షం మాత్ర‌మే కురిసిన‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.

Rains (Credits: Pixabay)

India To Receive 20% Below-normal Rains In June: వాస్త‌వానికి ఆ లాంగ్ పీరియ‌డ్‌లో స‌గ‌టున 80.6 ఎంఎం కుర‌వాల్సి ఉంది. కానీ జూన్ ఒకటో తేదీన నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత వ‌ర్షం నిలిచిపోయింది.

జూన్ 12 నుంచి 18 మ‌ధ్య కాలంలో.. అనుకున్న స్థాయికి వ‌ర్షం కుర‌వ‌లేద‌ని ఐఎండీ తెలిపింది. జూన్‌ 1 నుంచి భారత వాయువ్య ప్రాంతంలో 10.2 మి.మీ. (సాధారణం కంటే 70 శాతం తక్కువ), మధ్య భారత్‌లో 50.5 మి.మీ (సాధారణం కంటే 31 శాతం తక్కువ), దక్షిణాదిలో 106.6 మి.మీ (సాధారణం కంటే 16 శాతం అధికం), తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 146.7 మి.మీ (సాధారణం కంటే 15 శాతం తక్కువ) వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఒడిశా, కోస్ట‌ల్ ఆంధ్ర‌, బే ఆఫ్ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం నైరుతీ ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలిసింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.  తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ(IMD) కీల‌క అంశాన్ని వెల్ల‌డించింది. జూన్ నెల‌లో ఆశించినంత‌గా వ‌ర్షాలు ప‌డ‌లేద‌ని తెలిపింది. ఈ నెల‌లో స‌గ‌టున 20 శాతం త‌క్కువ‌గా వ‌ర్షం న‌మోదు అయిన‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది. కాగా నైరుతి రుతుపవనాలు నికోబార్‌ ప్రాంతంలోకి మే 19న ప్రవేశించాయి. మే 30 నాటికి దక్షిణ, మధ్య భారత్‌లో కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించాయి. సాధారణం కంటే ఆరు రోజులు ముందుగానే వచ్చాయి. జూన్‌ 12 నాటికి కేరళ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.