Hyderabad. June 19: తెలంగాణవ్యాప్తంగా (Telangana) వానలు (Rains) పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే ఐదురోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
లోతట్టు మునక
గత మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఇండ్లల్లకు నీళ్ళు వచ్చి చేరాయి. దీంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.