IRCTC New Rules: రైల్వే టికెట్ బుకింగ్ కొత్త రూల్స్, రెండో రిజర్వేషన్ చార్ట్‌లో పలు మార్పులు, ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ సిద్ధం
రైల్వే టికెట్ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కొత్త నియమాలను (New rule for ticket booking) ప్రకటించింది. కాగా రెండో రిజర్వేషన్ చార్ట్ సిద్ధంచేసే సమయంలో కొన్ని మార్పులను (IRCTC New Rules) తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన నియమాల ప్రకారం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయనున్నారు.
New Delhi, Nov 8: రైల్వే టికెట్ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త నియమాలను (New rule for ticket booking) ప్రకటించింది. కాగా రెండో రిజర్వేషన్ చార్ట్ సిద్ధంచేసే సమయంలో కొన్ని మార్పులను (IRCTC New Rules) తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన నియమాల ప్రకారం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయనున్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రారంభం అయ్యే రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను సిద్ధం చేసేవారు. దీంతో ఆఖరి సమయంలో ప్రయాణం రైద్దెన వాళ్లు టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు.
దీంతో ప్రయాణికులు రైల్వేపై అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో లాగానే రైలు ప్రారంభమయ్యే అరగంట ముందు సెకండ్ రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని ప్రయాణికుల నుంచి, జోనల్ కార్యాలయాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో మొదటి చార్ట్‌ను రైలు ప్రారంభమయ్యే కంటే నాలుగు గంటల ముందు, రెండో చార్ట్‌ను రైలు ప్రారంభమయ్యే అరగంట నుంచి ఐదు నిమిషాల మధ్య సిద్ధం చేస్తామని భారతీయ రైల్వే (Indian Railway Catering and Tourism Corporation (IRCTC) ప్రకటించింది. తాజా నిర్ణయంతో సెకండ్ చార్ట్ సిద్ధమయ్యే సమయంలో కూడా ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకొని రిఫండ్ పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్‌ఐఎస్)కు ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే మంగళవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు కౌంటర్ల వద్ద ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్‌ఎస్) ద్వారా కూడా ప్రయాణికులు సెకండ్ చార్ట్ సిద్ధం అయ్యే కంటే ముందు టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
బయలుదేరే 5 నిమిషాల ముందు టిక్కెట్ల బుకింగ్ లేదా రద్దు:
ప్రీ-కోవిడ్ సమయాల మాదిరిగానే, రైలు బయలుదేరే 4 గంటల ముందు 1 వ రిజర్వేషన్ చార్ట్ తయారు చేయబడుతుంది, 2 వ రిజర్వేషన్ చార్ట్ రైలు బయలుదేరే ముందు 30 నిమిషాల నుండి 5 నిమిషాల మధ్య తయారు చేయబడుతుంది. రెండవ రిజర్వేషన్ చార్ట్ తయారుచేసే వరకు, ప్రయాణీకులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వాపసు నిబంధనల ప్రకారం ఈ సమయంలో టికెట్లను కూడా రద్దు చేయవచ్చు. రిజర్వేషన్ల మొదటి చార్టులో బుక్ చేయబడిన సీటు, రద్దు కారణంగా ఖాళీగా ఉంటే, రెండవ చార్ట్ తయారుచేసే వరకు పిఆర్ఎస్ కౌంటర్ల ద్వారా మరియు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
How To Book IRCTC E-Ticket ( తెలుగు)
ముందుగా మీ వివరాలతో irctc.co.inలో లాగిన్ అవ్వండి
తర్వాత మీరు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ వివరాలు నమోదు చేయండి. ఇందులో ప్రయాణం తేదీ, కోచ్ బెర్త్ ని సెలక్ట్ చేసుకోండి
తర్వాత 'Find Trains' క్లిక్ చేయండి. అక్కడ కనిపించే రైలు వివరాల్లో మీరు ఏ రైలులో ప్రయాణం చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి. అందులో మీరు ప్రయాణించే తేదీలో రైళ్లలో ఖాళీ ఉందో లేదో సెర్చ్ చేయండి.
ఒకవేళ సీట్లు ఖాళీగా ఉంటే బుక్ టికెట్ సెలక్ట్ చేసుకోండి. అందులో కనిపించే వివరాలను పూర్తి చేయండి. name, age, gender, and berth preference లాంటి వివరాలు ఉంటాయి.
బెర్త్ కన్ఫర్మ్ అయితే మీకు టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది, ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ ఫోన్ నంబర్, క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. వివరాలు ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ నొక్కండి.
తర్వాత మీకు పేమెంట్ ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ మీరు మీ సౌలభ్యాన్ని బట్టి పేమెంట్ ఆప్సన్ ఎంచుకోండి.
పేమెంట్ పూర్తి అయిన తరువాత మీరు ఎంటర్ చేసిన ఫోన్ నంబర్ లేదా మెయిల్ కి టికెట్ వివరాలు వస్తాయి.
How To Book IRCTC E-Ticket
Log on to irctc.co.in and register to create your IRCTC account.
Fill in the source and destination, select the journey date, class of coach, and click on the 'Find Trains' option.
Choose the train from the list, along with the class of travel.
Click on the Check Availability option and fare of the journey.
If seats are available, proceed to Book Ticket.
Click on Book Now option, fill in the required details such as name, age, gender, and berth preference.
If the confirmed berths are allotted, the booking option will be allotted.
Scroll down and enter the phone number and captcha code. Click on the Continue Booking option.
At the payment options page, choose the preferred option for payment, i.e., credit card, debit card, or others.
After the payment is done, the ticket will be booked and the user will receive the confirmation along with your ticket on your registered phone number and email ID.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)