Visakhapatnam, Sep 15: అరకు లోయ అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ (Good News for Araku Tourists) చెప్పింది. విశాఖపట్నం నుంచి సుందరమైన అరకులోయను సందర్శించే పర్యాటకుల కోసం త్వరలో మరిన్ని విస్టాడోమ్ (గ్లాస్‌టాప్) కోచ్‌లను (Vistadome coaches) ప్రవేశపెట్టబోతోంది. అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి రైల్వే మంత్రి లేఖ రాశారు.
కాగా విశాఖపట్నం-అరకులోయ రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లను అమర్చాలంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి (Vijaya sai Reddy) గత మార్చిలో రైల్వే మంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. విశాఖ-అరకు రైలులో ప్రస్తుతం ఉన్న ఒక విస్టాడోమ్‌కు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో ఈ కోచ్‌కు అపరిమితమైన డిమాండ్ ఏర్పడింది. విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణానికి పర్యాటకులు రెండు నెలలు ముందుగా రిజర్వేషన్ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖ-అరకు రైలుకు మరో అయిదు విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని విజయసాయి చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ (Railway minister Piyush Goel) సానుకూలంగా స్పందిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లను జతచేయాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గోయల్ తెలిపారు. ప్రస్తుతం విస్టాడోమ్ కోచ్‌లు తయారీలో ఉన్నాయని, అవి అందుబాటులోకి రాగానే పర్యాటకుల నుంచి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లను విశాఖ-అరకు రైలు మార్గంలో ప్రవేశపెడతామని రైల్వే మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.