Indian Railway: ఇండియన్ రైల్వే అదిరిపోయే ఫీచర్, మీరు నిద్రపోయినా మీ గమ్యస్థానం రాగానే అలర్ట్, డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి

రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రపోయినా ఎలాంటి సమస్య ఉండదు. వారికోసం ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది .

Representative Image (Photo Credits: Unsplash)

ఇండియన్ రైల్వే తమ ప్రయాణికులకు సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రపోయినా ఎలాంటి సమస్య ఉండదు. వారికోసం ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది .

ఇదివరకే రాత్రి వేళ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నుంచి ఈ అంశంపై పలుమార్లు రైల్వే బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది.ఇందులో భాగంగా ఎంక్వైరీ సర్వీస్ నంబర్ 139లో రైల్వే ఈ కొత్త సేవను ప్రారంభించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ఈడ‌బ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ‌ను స్వాగతించిన సుప్రీం

ఈ సర్వీసు ద్వారా ప్యాసింజర్లు వారి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆందోళన లేకుండా నిద్రపోవచ్చు. ప్యాసింజర్‌ వారి గమ్య స్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు రైల్వే శాఖ నుంచి మీకు అలర్ట్‌ వస్తుంది. దీని ద్వారా మీరు నిద్రలేచి మీ గమ్య స్థానానికి చేరుకుంటారు.

ఎలా ఉపయోగించుకోవాలి

డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం సేవను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలంటే.. ఐఆర్‌సీటీసీ( IRCTC) హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. మీరు గమ్యస్థాన అలర్ట్‌ కోసం ముందుగా 7 నంబర్‌లను, ఆపై 2 నంబర్‌లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్‌ఆర్‌(PNR) నెంబర్‌ను నమోదు చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ వస్తుంది.