UTS Mobile Ticketing App: ఇక క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ నుంచి యూటీఎస్ ద్వారా ఫ్లాట్ ఫాం టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ మీకోసం

మీరు ఇకపై టికెట్ కోసం క్యూ లైన్లో నిల్చుకోకుండా నేరుగా యాప్ ద్వారా బుక్ (Book Platform Ticket) చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించింది.

File image of passengers waiting for trains (Photo Credit: PTI)

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. మీరు ఇకపై టికెట్ కోసం క్యూ లైన్లో నిల్చుకోకుండా నేరుగా యాప్ ద్వారా బుక్ (Book Platform Ticket) చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించింది. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజ‌ర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్ట‌మ్‌) యాప్‌ (UTS Mobile Ticketing App) అందుబాటులోకి తీసుకొచ్చింది.

UTS మొబైల్ యాప్ అనేది రిజర్వ్ చేయని రైలు టిక్కెట్ల కోసం అధికారిక భారతీయ రైల్వే టిక్కెట్ బుకింగ్ యాప్. మీరు దీని కోసం ఆండ్రాయిడ్ లేదా iOS మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. UTS యాప్‌ని ఉపయోగించి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కొత్త రూల్స్, రెండో రిజర్వేషన్‌ చార్ట్‌‌లో పలు మార్పులు, ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం

అయితే UTS టికెట్ బుకింగ్ సేవ 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి అందుబాటులో లేదని దయచేసి గుర్తుంచుకోండి.ఇకపై మీరు ప్లేఫార్మ్ టిక్కెట్‌ని కొనుగోలు చేయడానికి ఎక్కువ క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదు, ఆన్‌లైన్‌లో UTS టికెట్ బుకింగ్ మీకు సులభతరం చేసింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, బుకింగ్ టికెట్ రద్దయిన వెంటనే రీఫండ్, యూజర్ ఇంటర్ ఫేస్ అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్​సీటీసీ, IRCTC-ipay ద్వారా టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్ట‌ాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్‌లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ ప‌ని చేస్తుంది. స‌బ‌ర్బ‌న్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు త‌మ ప‌రిధిలోని రైల్వే స్టేష‌న్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని త్వరలో పెంచనుంది రైల్వేశాఖ.

యూటీఎస్‌ మొబైల్ యాప్‌ నియమ నిబంధనలు

►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి.

►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి.

►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్‌లను ప్రింట్ చేయలేరు.

►అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది.

►ప్లాట్‌ఫారం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి.

►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్‌ లెస్‌ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు.

►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్‌ టిక్కెట్‌ను బుక్ చేయలేరు.

►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్‌ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది.



సంబంధిత వార్తలు