IRCTC: కేవలం 20 రూపాయలకే రైల్వే స్టేషన్‌లో గదులు అద్దెకు లభిస్తాయని మీకు తెలుసా, రైల్వేలో మీకు తెలియని ఈ సదుపాయం గురించి ఓ సారి తెలుసుకోండి
ఇందులో కొన్ని సేవల గురించి రైల్వే ప్రయాణికులకు చాలామందికి తెలియకపోవచ్చు. వీటిల్లో ప్రధానంగా రైల్వే వెయిటింగ్ రూమ్ (IRCTC waiting room) గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
ఇండియన్ రైల్వే తన ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలందిస్తోంది. ఇందులో కొన్ని సేవల గురించి రైల్వే ప్రయాణికులకు చాలామందికి తెలియకపోవచ్చు. వీటిల్లో ప్రధానంగా రైల్వే వెయిటింగ్ రూమ్ (IRCTC waiting room) గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.రైల్వేస్టేషన్ లో (Indian Railways) ఉండే వెయిటింగ్ హాల్ లో రైలు వచ్చే వరకు వేచి ప్రయాణికులు వేచి ఉండొచ్చు.
అదేవిధంగా ఏదైనా కారణంతో చివరి క్షణాలలో రైలును రద్దు చేసిన, రీ షెడ్యూల్ చేసిన సందర్భాల్లో వేచి ఉండేందుకు అక్కడ గదులు కూడా ఉంటాయి.అయితే ఈ సదుపాయం టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం ఉంది. ఈ వెయిటింగ్ రూమ్ లకు రైల్వే శాఖ నామమాత్రంగా అద్దె వసూలు చేస్తుంది.రూ.20, రూ.40 చొప్పున చెల్లించి (IRCTC rooms available for Rs 20) ఈ గదుల్లో గరిష్ఠంగా 48 గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు.అయితే, రైలును రద్దు చేసినపుడు కానీ రీ షెడ్యూల్ చేసినపుడు కానీ ఆయా రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే రైల్వే శాఖ ఈ సదుపాయం కల్పిస్తోంది.
రైల్వే వెబ్ సైట్ ద్వారా ఈ గదులను బుక్ చేసుకోవచ్చు. ఈ గదులను బుక్ చేసుకోవడానికి మీరు //www.rr.irctctourism.com/#/homeని సందర్శించాలి. RAC టికెట్ హోల్డర్లు కూడా దీన్ని చేయవచ్చు. ఒక PNR నంబర్‌కు ఒక గదిని మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చిన వారికి మొదట సర్వ్ ప్రాతిపదికన గదులు కేటాయించబడతాయి.బుకింగ్ చేసిన తర్వాత, మీ గుర్తింపు పత్రాల కోసం మిమ్మల్ని అడుగుతారు.