Multiple Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి, మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఉపయోగాలు, నష్టాలు ఓ సారి చూద్దాం

దీనిపై నిపుణులు కూడా పలు విధాలుగా చెబుతుంటారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు (multiple savings accounts) ఉంటే చాలావరకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.

Representational Image (Photo Credit: PTI)

ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది అందరికీ చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగులకు అయితే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండి తీరాల్సిందే. అయితే చాలామందికి ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లు (Multiple Bank Accounts) ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ అకౌంట్లు (Multiple Savings Bank Accounts) ఉంటే లాభమా, నష్టమాఅనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. దీనిపై నిపుణులు కూడా పలు విధాలుగా చెబుతుంటారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు (multiple savings accounts) ఉంటే చాలావరకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. లాభాల విషయం పక్కన బెడితే దానివల్ల అకౌంట్ దారులకు కలిగే కొన్ని రకాల సమస్యలను ఓ సారి చూద్దాం.

ఎక్కువ అకౌంట్లు ఉంటే ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బు మాయమవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరం లేని అకౌంట్లను క్లోజ్‌ చేయడం మంచిదని బ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు. వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే వాటిల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఖచ్చితంగా మెయింటెన్‌ చేయాలి. ఇందుకోసం అన్ని ఖాతాల్లో ఎంతో కొంత డ‌బ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదికాకుండా ఇతర ఛార్జీల వసూలు ఉంటుంది. జీరో అకౌంట్ అయితే ఫరవాలేదు కాని సేవింగ్ అకౌంట్లు ఉంటే ఇది పెద్ద సమస్యగా మారుతుంది.

సాధారణంగా బ్యాంకులు స్టూడెంట్‌ అకౌంట్లు, శాలరీ అకౌంట్లుగా ‘జీరో బ్యాలెన్స్‌’ అకౌంట్లతో తమ టార్గెట్‌లను పూర్తి చేసుకుంటాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగి కంపెనీ మారితే ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి కంపెనీ తమకు అనుకూలంగా ఉన్న బ్యాంకుల ద్వారా ఉద్యోగులకు అకౌంట్లను అందిస్తాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులకు వెళ్లి పాత బ్యాంక్‌ ఖాతాను(అవసరం లేకుంటే) మూసివేయ‌డ‌మే మంచిది. ఎందుకంటే శాలరీ అకౌంట్‌లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో చాలాకాలం డిపాజిట్‌ చేయకుండా ఉంటే.. సాధార‌ణ సేవింగ్స్‌ అకౌంట్‌కు మారిపోతాయి. అప్పుడు క‌చ్చితంగా మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెయింటెన్‌ చేయకపోతే..సర్‌ ఛార్జీలు పడుతూనే పోతుంటాయి. అవి వేల రూపాయల్లోకి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఏదైనా బ్యాంకుపై లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా ఇలా చేయండి !

సాధారణంగా ఎక్కువ కాలం ట్రాన్‌జాక్షన్స్‌ జరగని అకౌంట్లను కొన్ని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఒకవేళ ఆ అకౌంట్లను తిరిగి ఉపయోగించుకోవాలనుకుంటే(యాక్టివేషన్‌ కోసం) రాత‌పూర్వకంగా రిక్వెస్ట్‌ లెటర్‌తో బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. దీని వల్ల ఎలాంటి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల స‌మ‌యంలో అన్ని ఖాతాల వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు తెలివిగా అకౌంట్లను మూసివేయకుండా సర్‌ఛార్జీల రూపంలో డబ్బును వసూలు చేస్తుంటాయి. కార్డుల మెయింటెనెన్స్‌, ఏటీఎం ఛార్జీలు, మొబైల్‌ అలర్టు అంటూ కస్టమర్ల దగ్గర నుంచి పిండేస్తాయి.

మీరు ఉద్యోగం మారినా.. పర్మినెంట్‌ అకౌంట్‌నే శాలరీ అకౌంట్‌గా మార్చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ సమస్య నుండి కొంచెం బయటపడవచ్చు. అలా కాకుంటే కొత్త ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే..పాత ఖాతాల్ని మూసేయ‌డం ఉత్తమం. ఇక పీఎఫ్‌ అకౌంట్‌ల విషయంలోనూ పాత అకౌంట్లను క్లోజ్‌ చేసి.. కొత్త అకౌంట్‌లకు షిఫ్ట్‌ చేయడం వల్ల ఒక అదనపు అకౌంట్‌ను మెయింటెన్‌ చేయాల్సిన బాధ తప్పుతుంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తీసుకోకుండా.. పర్మినెంట్‌ అకౌంట్‌నే ఉప‌యోగించాలి.

నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే, నవంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు దీపావళి సహా దాదాపు 15 రోజులు సెలవులు

ఇక ఉపయోగకరవిషయం ఏమిటంటే..బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వడ్డీలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చేసుకుని ఆ ఖాతాలు ఉంచుకుంటే మంచింది. మనకు వచ్చే వడ్డీ కన్నా కటింగ్స్ ఎక్కువగా ఉంటే వెంటనే వాటిని క్లోజ్ చేయండి. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేప్పుడు సింగిల్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ మీ పని కూడా చాలా తేలికగా ఉంటుంది. దీంతో పాటు ఒక ఖాతా ఉంటే పాస్‌ వర్డ్‌లను, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాలను ఈజీగా గుర్తించేకునే అవకాశం ఉంది.