IPL Auction 2025 Live

ITR Filing Last Date Today: ఐటీఆర్‌ ఫైలింగ్ దాఖలు చేసేందుకు చివరి తేదీ నేడే, చేయకపోతే మీరు ఏం లాస్ అవుతారో ఓ సారి చెక్ చేసుకోండి

నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Income Tax Return (Representational Image; Photo Credit: Pixabay)

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు.

ఫైలింగ్‌ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్‌ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్‌ పోర్టల్‌ పనితీరు బాగుంది. ఫైలింగ్‌ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చని ట్వీట్‌ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌లైన్‌ జులై 31లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే లేట్‌ ఫీ రూ.5,000 చెల్లించాలి.

ఈ లేట్ ఫీజు ద్వారా సెంబర్‌ 31లో మరో సారి ఐటీఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు లేట్‌ ఫీ ఛార్జీలు వర్తించవు.

మీరు రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే ట్యాక్స్‌ పేయర్స్‌ చెల్లించే పన్నులో నెలకు 1 శాతం చొప్పున ఆదాయపు పన్ను శాఖ వడ్డీని వసూలు చేస్తుంది. ఒక కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు అమ్మకందారు వసూలు చేసే ట్యాక్స్‌ టీసీఎస్, జీతాలు, కమీషన్, వడ్డీలు, డివిడెంట్లు ఇలా వివిధ రకాల ఆదాయ వనరులపై విధించే ట్యాక్స్ టీడీఎస్‌, ముందస్తు పన్ను, చట్టం క్రింద లభించే ఇతర ట్యాక్స్‌ రిలీఫ్‌/ట్యాక్స్‌ క్రెడిట్‌ల తగ్గింపు తర్వాత నికర ఆదాయంపై విధించే పన్నుపై వడ్డీ వర్తిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒక రోజు ఆలస్యానికి కూడా ఒక నెల వడ్డీ వసూలు చేస్తారు.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ గడువు పొడిగించే ప్రసక్తే లేదు! చివరి రోజు గంటలకు ఐదులక్షల ఫైలింగ్స్, ఇంకా కొద్ది గంటలే ఉండటంతో భారీగా ఫైలింగ్స్ జరుగుతున్నాయని ఐటీవిభాగం ప్రకటన. ఇప్పటివరకు 5.10 కోట్లు దాటిన ఐటీఆర్‌లు

దీంతో పాటు నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్‌ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్‌ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోలేము. జరిమానాలతో పాటు, పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తే , 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చేయాలి? 5 నిమిషాలలో పని పూర్తి చేయవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి

టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. అదీ సకాలంలో ఐటీఆర్‌ ఫైల్‌ చేసినప్పుడే. సమయానికి ఐటీఆర్‌ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్‌ రిఫండ్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.