New Delhi: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆదాయపు పన్ను కట్టేవారు తమ ఐటీ రిటర్న్ (ITR) లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా మీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకుంటే మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది, లేకపోతే వడ్డీతో సహా రూ. 10 వేలు అపరాధ రుసుం కట్టాల్సి వస్తుంది.
అయితే ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఎవరి సహాయం మీరు తీసుకోవాలో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరే అసలు ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేయవచ్చో ఈ క్రింది విధానాల ద్వారా తెలుసుకోండి.
ఆదాయపు పన్ను రిటర్న్ (Income Tax Return) ఎలా దాఖలు చేయాలి:
1) ఐటీ రిటర్న్ దాఖలు చేసేటపుడు అన్నింటికంటే ముందు, మీకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ బ్యాంక్ ఖాతా మరియు పొదుపుకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
2) ఆదాయపు పన్నుకు సంబంధించిన వెబ్ పోర్టల్ కు వెళ్లి 'e-filing portal' ఆప్షన్ ను ఎంచుకొని మీ పేరు, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ కార్డ్ నెంబరే మీ యూజర్ ఐడీ అవుతుంది.
3) మీరు ఏ సంవత్సరానికైతే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నారు, ఆ సంవత్సరాన్ని ఎంచుకొని తర్వాత మీకు ఏ ఫారం అయితే సరిపోతుందో అంటే
సాలరీ తీసుకునేవారా లేక పింఛన్ దారుడా లేదా వడ్డీ వ్యాపారం చేసేవారైతే ITR-1 సెలెక్ట్ చేసుకోవాలి.
మీ సంపాదన క్యాపిటల్ గెయిన్స్ అయితే ITR-2 సెలెక్ట్ చేసుకోవాలి
వ్యాపారవేత్త, వృత్తిపరమైన వ్యాపారం చేసే వారైతే ITR 3, 4 మరియు 4S సెలెక్ట్ చేసుకోవాలి.
4) ఇప్పుడు మీ బ్యాంక్ స్టేట్ మెంట్, ఫారం 16 అలాగే మిగతా పెట్టుబడులకు సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. మీ వార్షిక సంపాదన రూ. 50 లక్షలు పైగా ఉంటే ఆస్తులకు సంబంధించి 'AL' అదనపు కాలంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి, ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత సబ్ మిట్ చేసేయాలి.
5) పైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మరోసారి సరిచూసుకోవాల్సిందిగా సూచిస్తుంది. తప్పులైమైనా ఉంటే సరిచేసుకొని చివరిసారిగా సబ్ మిట్ చేసేస్తే చాలు. మీ ఐటీ రిటర్న్ విజయవంతంగా పూరి చేసినట్లే.
ఇదే విషయం మీ మొబైల్ కు మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం వస్తుంది.