ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ గడువు పొడిగించే ప్రసక్తే లేదు! చివరి రోజు గంటలకు ఐదులక్షల ఫైలింగ్స్, ఇంకా కొద్ది గంటలే ఉండటంతో భారీగా ఫైలింగ్స్ జరుగుతున్నాయని ఐటీవిభాగం ప్రకటన. ఇప్పటివరకు 5.10 కోట్లు దాటిన ఐటీఆర్‌లు
ITR Filing For 2019-20

New Delhi, July 31: గ‌త ఆర్థిక సంవ‌త్స‌రా (2021-22)నికి ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు పొడిగించ‌బోమ‌ని కేంద్రం తేల్చి చెప్పింది. ఒక‌వేళ ఆదివారం అర్ధ‌రాత్రిలోపు ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) పూర్తి చేయ‌క‌పోతే సోమ‌వారం నుంచి రూ.5000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఫైన్‌తో ఐటీఆర్ స‌బ్మిట్ చేయొచ్చు. వేత‌న జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) ఐటీఆర్‌లు (ITR Filing) దాఖ‌లు చేయ‌డానికి జూలై 31 తుది గ‌డువు. ఇదిలా ఉంటే, శ‌నివారం నాటికి 5.10 కోట్ల‌కు పైగా ఐటీఆర్‌లు  (ITR) దాఖ‌ల‌య్యాయి. శ‌నివారం ఒక్క‌రోజే 57.71 ల‌క్ష‌ల మందికి పైగా ఐటీఆర్‌లు స‌బ్మిట్ చేశార‌ని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఆదివారం గ‌డువు ముగిసేలోపు మొత్తం ఐటీఆర్‌లు దాఖ‌లు చేసిన వారి సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని కేంద్ర అధికార వ‌ర్గాలు తెలిపాయి.

ఎట్టి ప‌రిస్థితుల్లో ఐటీఆర్ స‌బ్మిట్ చేయ‌డానికి గ‌డువు పొడిగించ‌డానికి కేంద్రం నిరాక‌రించింది. చివరిరోజు కావడంతో భారీగా ఐటీఆర్‌లు ఫైలింగ్ జరుగుతున్నాయి. గంటకు దాదాపు ఐదులక్షల ఐటీఆర్‌లు ఫైలింగ్ జరుగుతున్నట్లు ట్వీట్ చేసింది ఐటీ విభాగం.

ITR Filing Deadline: ఐటీ ఫైలింగ్ చివరిరోజు ఆదివారం కదా! రిటర్న్స్ సమర్పించడం ఎలా? అలాంటి సమస్య ఉందో ఇదుగోండి పరిష్కారం, ఆదివారం దాటిందంటే ఫైన్ తప్పదు  

మీరు ఐటీఆర్ ఇప్ప‌టికే దాఖ‌లు చేసి ఉంటే మంచిది. ఒక‌వేళ దాఖ‌లు చేయ‌కుంటే వెంట‌నే ప‌ని పూర్తి చేయండంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇన్‌కం టాక్స్ విభాగం (income tax) తెలిపింది. కానీ, కొంద‌రు ప‌న్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులు మాత్రం చివ‌రిక్ష‌ణంలో కేంద్రం గ‌డువు పొడిగిస్తుంద‌ని ఆశాభావంతో ఉన్నారు. ప‌న్ను చెల్లింపుదారులు eportal.incometax.gov.in అనే ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌కు వెళ్లి ఉచితంగా ఐటీఆర్ దాఖ‌లు చేయొచ్చు.