NEET PG 2024 New Date Announced: నీట్‌ పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల, ఆగస్టు 11న ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష, వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నీట్ యూజీ

నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ తేదీలను ప్రకటించింది.

Exams Results

New Delhi, July 5: పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీల షెడ్యూల్ ఈ రోజు రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ తేదీలను ప్రకటించింది. నిర్వహిస్తారు. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) గత ఏడు సంవత్సరాలుగా NEET-PG పరీక్షను జరుపుతోంది. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ కారణంగా జూన్ 23న నీట్ పీజీ పరీక్షను రద్దు చేశారు. రద్దైన రెండు వారాల తరువాత కొత్త షెడ్యూల్‌ని ప్రకటించారు.

దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఈసారి అత్యంత వివాదాస్పదమైంది.ఎన్నడూ లేనంతగా పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం, సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడం, అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్షపైనా పడింది. దాంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది.  నీట్‌ పరీక్ష 2024కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ.

పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి పలు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీకుల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే నీట్ యూజీ పరీక్షలో లీకుల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కమిటీని నియమించారు. అలాగే నీట్ రీ టెస్ట్ కూడా రద్దయింది. దీన్ని జూలై 25-27 తేదీల్లో నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నీట్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి వేసే ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేయాల్సిన పరిస్ధితి ఉంది.



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.