Toll Tax: ముందు అద్దంపైనే ఫాస్టాగ్, లేదంటే బాధుడే బాధుడు? ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం

ఫ్రంట్ స్క్రీన్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్ లేకుండా టోల్ లైన్‌లో ప్రవేశించే వాహనదారుల

fastag.jpg(Twitter)

Hyd, July 19:  నుండి డబుల్ టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్‌ను కూడా విడుదల చేసింది.

కొంతమంది వాహనదారులు ఉద్దేశ పూర్వకంగానే ఫాస్టాగ్‌ను ముందు అద్దంపై అతికించకుండా టోల్ లైన్‌లోకి రావడం వల్ల మిగిలిన వాహన దారులకు ఇబ్బంది కలుగుతోందని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

ఇందుకు సంబంధించి అన్ని టోల్ ప్లాజాలకు ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఇకపై ఏదైనా వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ స్టిక్కర్ అతికించకపోతే రెట్టింపు టోల్ చెల్లించక తప్పదు. అలాగే ఫాస్టాగ్‌లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీని సైతం రికార్డు చేయాలని సూచించింది. అలాంటి వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు వెనుకాడబోమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వెయ్యి టోల్ ప్లాజాలు ఉండగా ప్రతిరోజు 8 కోట్ల మంది నుండి టోల్ వసూలు చేస్తున్నారు. జూలై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం, బిఎసి సభ్యులు ఎవరెవరంటే..