PAN Aadhaar Link: ఆధార్‌కు పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరు ఆధార్-పాన్ కార్డ్ లింక్‌ చేయనవసరం లేదో ఓ సారి తెలుసుకోండి

ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది. కానీ అదనంగా రూ. 1000 చెల్లించి జూన్ 30 వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరి తేదీ కాస్త ముగుస్తుంది.

Linking Aadhaar with PAN Card

PAN-Aadhaar Linking Deadline Ends Today: పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది. కానీ అదనంగా రూ. 1000 చెల్లించి జూన్ 30 వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరి తేదీ కాస్త ముగుస్తుంది.

ఆధార్‌కు పాన్ లింక్ స్టేటస్ SMS ద్వారా తెలుసుకోవడం ఎలా, సింపుల్ ప్రాసెస్ మీకోసం..

నిర్ణిత సమయంలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ నంబర్ పనిచేయదు. దీంతో పాన్ ఉపయోగించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే, పాన్ కార్డు పనిచేయకపోవడంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింక్ చేయని వారు ఆదాయపు పన్ను శాఖ వారి అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి పాన్, ఆధార్ నెంబర్, మిగతా వివరాలను నమోదు చేసి లింక్ చేసుకోవచ్చు.

కార్డు పనిచేయకపోతే అనేక సౌకర్యాలు వినియోగదారులకు నిలిపివేయబడతాయి. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-272B ప్రకారం రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇదే సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయటం కుదరదు. బ్యాంకులో ఖాతాను నిర్వహించాలంటే మారిన కేవైసీ రూల్స్ కింద తప్పనిసరిగా పాన్ వివరాలు కస్టమర్లు అందించాల్సి ఉంది.

పాన్- ఆధార్ లింక్ ఈ రోజే చివరి రోజు, ఈ లింక్ ద్వారా వెంటనే చేయండి, లేదంటే పాన్ కార్డు డిలీట్ అవుతుంది

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ తప్పనిసరి. అలాగే టాక్స్ రిఫండ్స్ పొందాలన్నా పాన్ తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం జూలై 1, 2017 వరకు PAN కార్డ్ జారీ చేయబడిన, ఆధార్ కార్డ్‌ని కలిగి ఉన్న ప్రతి పౌరుడు వాటిని లింక్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో అసోం, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ నివాసితులకు ఆధార్-పాన్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఆధార్-పాన్ కార్డ్ లింక్‌ చేయటం తప్పనిసరి కాదు. 80 ఏళ్లు పైబడిన వారు, గత సంవత్సరం వరకు భారత పౌరులు కాని వారికి కూడా ఇది పూర్తి చేయాల్సిన అవసరం లేదు.